Homeఎంటర్టైన్మెంట్OG movie release : అమెరికాలో పవన్ అభిమానులు ఇవే తగ్గించుకోవాలి..

OG movie release : అమెరికాలో పవన్ అభిమానులు ఇవే తగ్గించుకోవాలి..

OG movie release  : రోమ్ లో రోమన్ లా ఉండాలంటారు.. లేకపోతే అనర్ధాలు వస్తాయి. ఇప్పుడు అమెరికా నుంచి వస్తున్న ఉపద్రవాలే ఇందుకు నిదర్శనం. బతకడానికి వెళ్లినవారంతా అక్కడి సమాజంతో కలిసిపోవాలి. వారి సంస్కృతి సంప్రదాయాలు పాటించాలి. కానీ మన సంస్కృతి సంప్రదాయాలు అలవాట్లను అక్కడి వారిపై రుద్ధుతామంటే.. ఇలానే ట్రంప్ లాంటోడు వస్తాడు. అందిరినీ వారి దేశం నుంచి తన్ని తరిమేస్తాడు. ఇప్పుడూ అదే జరుగుతోంది. 

H1B వీసా సమస్యల నేపథ్యంలో తెలుగు కమ్యూనిటీకి అమెరికాలో పరిస్థితి ఇప్పటికే సెన్సిటివ్‌గా ఉంది. అలాంటప్పుడు సినిమా ఫ్యాన్స్ హంగామా మరింత ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, ముఖ్యంగా అమెరికాలో ఉండే వారు, అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

H1B కలకలం & ఇండియన్ కమ్యూనిటీ

అమెరికాలో H1B వీసాలపై వ్యతిరేకత కొత్తది కాదు కానీ, ట్రంప్ పాలనలో ఇది మరింత పెరిగింది. అధిక ఫీజులు, కఠిన నిబంధనలు, లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌పై అపోహలు.. అమెరికాలో ప్రవాస భారతీయులపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. ఈ టెన్షన్‌లోనే స్టూడెంట్ వీసాలతో వచ్చిన వారి ప్రవర్తన, ఓవర్‌సెలబ్రేషన్స్ “అమీర్‌పేట్ మెంటాలిటీ” లాంటి ట్యాగులు అమెరికాలోని ఇతర కమ్యూనిటీల నుంచి ప్రతికూలతను మరింత పెంచుతున్నాయి.

సినిమా హంగామా ప్రభావం

అమెరికాలో ఇండియన్ సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. కానీ థియేటర్స్‌లో చేయబడే హంగామా అరుపులు, నృత్యాలు, కొబ్బరికాయలు పగలగొట్టడం, ఫైర్‌వర్క్స్ ఇవన్నీ అక్కడి కుటుంబాలకు డిస్టర్బెన్స్ అవుతున్నాయి. ఇతర కమ్యూనిటీలకు ఇవి ఆశ్చర్యకరంగానేగాక, కొన్నిసార్లు డిస్టర్బెన్స్ ఆఫ్ పబ్లిక్ పీస్ కేసులుగానూ మారవచ్చు. ఒకరిరెండు తప్పులు చేస్తే కేవలం వాళ్లకే సమస్య. కానీ ఒక గ్రూప్ చేస్తే “ఇండియన్ కమ్యూనిటీ డిస్టబెన్స్” అనే లేబల్ పడుతుంది.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాధ్యత

పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు కూడా కావడంతో ఆయన అభిమానులు మరింత కంట్రోల్ చూపించాలి. వారి సెలబ్రేషన్స్ వల్ల కేవలం సినిమా ఫ్యాన్ ఇమేజ్‌కే కాదు, మొత్తం కమ్యూనిటీ ఇమేజ్‌కి కూడా నష్టం వచ్చే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా OG రిలీజ్ సందర్భంలో డల్లాస్ వంటి ప్రాంతాల్లో హంగామా మొదలైతే, అది ఇతర స్టేట్స్‌లోనూ కాపీ అవుతుంది. ఇదే నిర్లక్ష్యం కొనసాగితే లీగల్ ఇష్యూస్, వీసా రద్దులు, డిపోర్టేషన్స్ వంటి అతివ్యాఖ్యలూ రాకపోవు.

అవసరమైన అవగాహన

ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యాన్స్ కేవలం సెలబ్రేషన్‌ను పర్సనల్‌గా అనుభవించే విధంగా మార్చుకోవాలి. అరుపులు, పబ్లిక్ రిచువల్స్ బదులు, శాంతంగా మూవీ చూడటం, సోషల్ మీడియాలో రివ్యూలు పంచుకోవడం మంచిది. ప్రతి ఒక్కరికి గుర్తుంచుకోవల్సింది ఏంటంటే.. ఒక చిన్న హంగామా, ఒక క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయితే, అది మొత్తం కమ్యూనిటీపై ప్రభావం చూపిస్తుంది.

అమెరికాలో ఇప్పటికే ఇండియన్ కమ్యూనిటీపై ప్రతికూలత పెరుగుతున్న సమయంలో, సినిమా హంగామాలు అదనపు సమస్యలను సృష్టిస్తున్నాయి. H1B వల్ల లీగల్ ఇమ్మిగ్రేషన్ కఠినతరం అవుతున్న వేళ, ఫ్యాన్స్ హడావుడి మొత్తం తెలుగు కమ్యూనిటీకి నష్టమే. ఈ పరిస్థితిలో అభిమానులకి ఒకే మార్గం.. స్వీయ నియంత్రణ మరియు అవగాహన ముఖ్యం.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version