Genghis Khan : ఒక మనిషి ప్రాణం తీస్తే అతడిని హంతకుడు అంటాం. అలాంటిది నాలుగు కోట్ల మంది ప్రాణాలు తీసిన వ్యక్తిని ఏమనాలి.. వందలాది గ్రామాలను నేలమట్టం చేసిన వ్యక్తిని ఏ పేరుతో పిలవాలి.. వ్యవస్థలను నాశనం చేసి.. రాజ్యాలను.. రాణులను చెరబట్టి.. రాజులను చూస్తుండగానే హతం చేసి.. రక్త పిపాసిగా.. పేరు పొందిన వ్యక్తిని నేటి కాలంలో ఎకో సేవర్ అని పిలుస్తున్నారు. మొక్కలను నాటి.. చెట్లుగా ఎదిగేలా చేసి.. పర్యావరణానికి మేలు చేసిన వ్యక్తులను ఎకోసేవర్లు అని పిలుస్తుంటారు. ఎకోసేవర్లను ప్రత్యేకంగా గుర్తిస్తుంటారు. గౌరవిస్తుంటారు. కానీ మనుషులను అంతం చేసి.. వ్యక్తులను, వ్యవస్థలను సర్వనాశనం చేసిన నియంతను ఎకోసేవర్ అని పిలవడమే ఈ కాలంలో వింత.
ఎకోసేవర్ గా ఇప్పుడు పిలుస్తున్న ఆ వ్యక్తి పేరు ఛంఘీజ్ ఖాన్. ఈ పేరు వింటే నియంత గుర్తుకొస్తాడు. రక్తానికి మరిగిన రాక్షసుడు కళ్ళ ముందు కనిపిస్తాడు. ఇదేదో మేము చేస్తున్న ఆరోపణ కాదు.. చరిత్రలో ఉన్న సత్యం. చరిత్ర చెప్పిన పాఠం. తన రాజ్యాన్ని విస్తరించడానికి.. తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఛంఘీజ్ ఖాన్ చేయని ఘోరం అంటూ లేదు. చేపట్టని దారుణం అంటూ లేదు. నాలుగు కోట్ల మందిని చంపేశాడు. వందలాది రాజ్యాలను ఆక్రమించాడు. తన పరాక్రమానికి అడ్డువచ్చిన ప్రతి ఒక్కరిని తొక్కుకుంటూపోయాడు. మనుషులను చూస్తుండగానే సజీవ దహనం చేశాడు. తనకు లొంగని రాజ్యాలను తగలబెట్టాడు. తన కోరిక తీర్చని రాణులను బలవంతంగా అనుభవించి.. అంతం చేశాడు. అతని అధికార దాహానికి ఎంతోమంది బలయ్యారు. అతని ఖడ్గానికి ఎంతోమంది నిలువునా కూలిపోయారు. అటువంటి వ్యక్తిని పాపాత్ముడు అని పిలవక.. కఠినాత్ముడు అని సంబోధించక.. దుర్మార్గుడు అని సూత్రికరించక.. కొత్తగా ఎకోసేవర్ అని పిలవడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
12 , 13 శతాబ్దల కాలంలో ఛంఘీజ్ ఖాన్ మధ్య ఈశాన్య ఐరోపాలో అనేక రాజ్యాలను సొంతం చేసుకున్నాడు. దండయాత్రలు చేశాడు. దాదాపు నాలుగు కోట్ల మందిని చంపేశాడు. తన రాజ్యకాంక్ష కోసం దుర్మార్గాలు చేశాడు. పన్నాగాలు పన్నాడు. చరిత్రలో ఏ రాజు చేయని విధంగా అత్యంత ఘోరాతి ఘోరమైన పనులు చేశాడు. అందువల్లే అతడిని రాక్షస రాజు అని పిలిచేవారట.. అయితే అతడు క్రూరుడు మాత్రమే కాదని.. ఎకోసేవర్ అని కార్నిగి సైన్స్ అనే సంస్థ అభిప్రాయపడుతోంది.. ఇందుకు కారణాలు కూడా చెప్పింది.
ఛంఘీజ్ ఖాన్ నాలుగు కోట్ల మందిని చంపడం ద్వారా భూమ్మీద భారం పడకుండా చేశాడట. వీరి వల్ల భూమ్మీద వనరులు పరిరక్షణకు గురయ్యాయట. వందలాది రాజ్యాలను నాశనం చేయడం ద్వారా.. భూమ్మీద మొక్కలు పెరగడానికి ఆస్కారం ఏర్పడిందట. ఇవి దాదాపు నాలుగు కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకున్నాయట. దాదాపు నాలుగు కోట్ల మందిని హతం చేయడం ద్వారా కొత్త తరం పుట్టడానికి ఆస్కారం ఏర్పడిందట. తద్వారా వనరుల మీద ఒత్తిడి తగ్గిందట. నీరు, భూమి, ఖనిజాలు భావితరాలకు వచ్చాయట..ఛంఘీజ్ ఖాన్ లాంటి నరరూప రాక్షసుడికి ఎకోసేవర్ అని బిరుదు ఇవ్వడం పట్ల చాలామంది మండిపడుతున్నారు. ఇటువంటి వ్యక్తిని పర్యావరణహిత కారుడు అని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు.