England vs India ఇంగ్లాండ్ లో జరుగుతున్న అండర్సన్ – టెండూల్కర్ సిరీస్ లో అనేక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మూడు టెస్ట్ జరుగుతున్న లార్డ్స్ లో నాటకే పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఈ మైదానంలో జరుగుతున్న మ్యాచ్ మూడో రోజు ఇంగ్లాండు ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు ఓపెనర్లు చేసిన అతి భారత ప్లేయర్లను తీవ్రంగా ఇబ్బందికి గురిచేసింది. ముఖ్యంగా క్రావ్ లీ భారత ప్లేయర్ల సహనాన్ని పరీక్షించాడు. పదేపదే ఇబ్బంది కలిగించాడు. ఒక సందర్భంలో చేతికి బంతి తగిలిందని ఫిజియోలను మైదానంలోకి పిలిపించుకున్నాడు. మరో సందర్భంలో బుమ్రా బంతి వేయడానికి వస్తుండగా అర్ధాంతరంగా క్రీజ్ నుంచి బయటికి వచ్చాడు. ఇలా రెండు సందర్భాల్లో చేయడంతో భారత ఆటగాళ్లకు కోపం తారస్థాయికి చేరుకుంది. దీంతో కెప్టెన్ గిల్ ఎంటర్ కాక తప్పలేదు.
“బంతులను ఎదుర్కోలేక భయపడుతున్నావా.. ఇదేనా ఆట.? ఇదేనా క్రీడా స్ఫూర్తి.. ఒక పని చెయ్ ఏవైనా అడ్డుపెట్టుకో అంటూ”.. చేతులతో క్రావ్ లీ కి బుమ్రా సంకేతాలు చూపించాడు.. ఇక సిరాజ్ అయితే రెచ్చిపోయాడు. విరాట్ కోహ్లీ వారసత్వాన్ని అందిపుచ్చుకొని దూషణల పర్వానికి దిగాడు. మా బౌలింగ్ ను ఎదుర్కోలేక ఇలా ఆడుతున్నారంటూ ఇంగ్లాండ్ ప్లేయర్లపై మండిపడ్డాడు. బంతులను ఎదుర్కోలేక ఇలా ఎంతసేపు ఆత్మరక్షణ ధోరణి ప్రదర్శిస్తారంటూ సిరాజ్ మండిపడ్డాడు. ఇది ప్లేయర్ల లక్షణం కాదంటూ విమర్శించాడు. ఇలాంటి ఆటతీరుతో క్రీడా స్ఫూర్తి ఎలా ప్రదర్శిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిరాజ్ దూషణల పర్వానికి దిగిన తర్వాత భారత ప్లేయర్లు ఒక్కసారిగా క్రావ్ లీ ని చుట్టుముట్టారు. చప్పట్లు కొడుతూ హేళన చేశారు. దీంతో అతడు ఇబ్బంది పడ్డాడు. ఏం మాట్లాడాలో తెలియక నిశ్శబ్దాన్ని ఆశ్రయించాడు.
క్రావ్ లీ వ్యవహరించిన తీరు పట్ల ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు సానుకూలంగా స్పందిస్తున్నారు.. క్రికెట్లో ఈ తరహా సంఘటనలు సర్వసాధారణమని ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు మైకేల్ వాన్, కుక్ పేర్కొన్నారు. ” అతడు సమయాన్ని వృధా చేయలేదు. సద్వినియోగం చేసుకున్నాడు. మైదానంలో తనకంటూ ఒక ప్రణాళికను రూపొందించుకొని దానికి తగ్గట్టుగా నడుచుకున్నాడు.. రెండవ రోజు కూడా భారత జట్టు ఇదే వ్యూహాన్ని అమలు చేసింది.. దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇందులో తప్పు వెతకవలసిన అవసరం లేదు. దీనిపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదు.. ఒకవేళ ఇంగ్లాండ్ ఆటగాడు తప్పు చేసి ఉంటే భారత ప్లేయర్లు ఫిర్యాదు చేసేవారు కదా. ఎందుకంటే ఈ మ్యాచ్లో రెండవ రోజు భారత కెప్టెన్ గిల్ కండరాల గాయం వల్ల కాసేపు ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలో రాహుల్ బయటికి వెళ్లాడు. దాని గురించి ఇంగ్లాండు ప్లేయర్లు ఫిర్యాదు చేయలేదు కదా. రెండు జట్లు కూడా ఇదే విధానాన్ని అనుసరించినప్పుడు తప్పు ఎలా పడతారు.. ఇది నాటకీయ పరిణామానికి బలమైన ఉదాహరణ. దీనిని ఇలానే చూడండి. అంతేతప్ప వ్యతిరేక భావనలో చూడకూడదు. ఐదో రోజు ఆట కూడా అద్భుతంగా ఉంటుంది. నాలుగు రోజు ఆట విచిత్రంగా సాగుతోంది. ఇన్ని మలుపులు చోటు చేసుకోవడం వల్లే ఈ మ్యాచ్ ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తోందని” వాన్, కుక్ అభిప్రాయపడ్డారు. ఓ చానల్ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.