Artificial Intelligence : చెప్పినవన్నీ చేస్తోంది. పనికి కూడా చేస్తోంది. వందలాది మంది చేసే పనిని ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఒక్కటే చేస్తోంది. ఫలితంగా కంపెనీలకు భారీగా నగదు మిగులుతోంది. అంతేకాదు తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకునే అవకాశం కలుగుతోంది. దీంతో ఐటీ రంగం తీవ్రస్థాయిలో కుదుపులకు గురవుతోంది. చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్న నేపథ్యంలో ఐటీ రంగంలో ఒక రకమైన ఆనిశ్చితి ఏర్పడుతోంది. ఇప్పటికే కంపెనీలు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ కావడంతో వేలాదిమందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. భవిష్యత్తు కాలంలోనూ ఉద్యోగుల తొలగింపు ఉంటుందని హెచ్చరిస్తున్నాయి.
ఉద్యోగుల తొలగింపు నేపథ్యంలో చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని తిట్టుకుంటున్నారు. ఈ టెక్నాలజీ వల్ల తమ జీవితాలు రోడ్డున పడ్డాయని బాధపడుతున్నారు. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఉద్యోగాలు పోతాయి అనేది నిజమే.. అయితే ఈ టెక్నాలజీ ద్వారా కొత్త ఉద్యోగాల సృష్టి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ టెక్నాలజీని కొనసాగించడానికి.. ఈ టెక్నాలజీలో కొత్త కొత్త మార్పులు తీసుకురావడానికి నిపుణులు కచ్చితంగా అవసరం పడతారు. అలాంటప్పుడు కొత్త ఉద్యోగుల సృష్టి అనేది కచ్చితంగా జరుగుతుంది. ఈ రంగంలో నిపుణులకు డిమాండ్ కూడా అధికంగా ఉంటుంది.. అయితే ఇప్పుడు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కూడా నెగిటివ్ ప్రచారం ఒకటి జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి రూపకర్త అయిన ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్ మన్ చేసిన వ్యాఖ్యలు. ఇటీవల ఆల్ట్ మన్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కోసం కొత్త హార్డ్వేర్ అవసరం లేదని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఏఐ అనేది మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది.
ఈ క్రమంలోనే హార్డ్వేర్ విషయంలో ఆల్ ఒక్కసారిగా మాట మార్చారు. ప్రస్తుతం కంప్యూటర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఏర్పాటు చేసినవి కావని.. వీటికోసం కొత్తగా కంప్యూటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు తమ సంస్థ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి డివైస్ స్టార్టప్ పనులు కూడా మొదలు పెట్టినట్టు వెల్లడించారు.
ఇప్పటికే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ అని రంగాలలో దూసుకుపోతున్న నేపథ్యంలో హార్డ్వేర్ విషయంలో ఆల్ట్ మన్ మాట్లాడిన మాటలు సంచలనం కలిగిస్తున్నాయి. వాస్తవానికి ఏదైనా ఒక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగానే హార్డ్వేర్ అవసరం ఉంటుంది. ఆ హార్డ్వేర్ కూడా ముందుగానే రూపొందించి ఉంటుంది. కానీ ఏఐ విషయంలో అలాంటి ప్రయత్నం జరగలేదని ఆల్ట్ మన్ మాటలు ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సంబంధించి నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఎందుకంటే ఇప్పటికే దీని వినియోగం తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఆ స్థాయిలో హార్డ్వేర్ లేకపోతే ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏఐ అనేది తిరోగమనంలో ఉంటుంది. అప్పుడు టెక్నాలజీ అనేది గతంలో ఉన్న విధానంలోకి మారిపోతుంది. మరోవైపు కొత్త కంప్యూటర్ల అవసరాన్ని ఆల్ట్మన్ చెప్పిన నేపథ్యంలో.. హార్డ్వేర్ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ రంగంలోనూ కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుంది.
ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆ స్థాయిలో గనుక హార్డ్వేర్ సాధ్యం కాకపోతే.. అది తిరోగమనలో ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.. ఆల్ట్మన్ చేసిన వ్యాఖ్యలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని వ్యాఖ్యానిస్తున్నారు.. మరి దీనిపై ఓపెన్ ఏఐ సీఈవో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.