Pakistanis in UK : రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగే ఉండాలని ఓ సామెత. అంటే ఏ దేశంలో ఉంటే.. దేశానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. కాదు, కూడదు, కుదరదు అని అంటే.. కచ్చితంగా ఆ దేశం నుంచి పెట్టే, బేడా సర్దుకొని రావాలి. అంతేతప్ప మా ఇష్టం, మేము ఇలానే ఉంటాం, మాకూ హక్కులు ఉన్నాయని వితండవాదం చేస్తే తన్ని తరిమేస్తారు. లేదా జైల్లో పెడతారు. ఇప్పుడెందుకు ఈ ఉపోద్ఘాతం అంటే.. ఈ స్టోరీ చదవండి మీకే తెలుస్తుంది..
ఉన్న దేశంలో ఉపాధి లేదు. చదువుకోవాలంటే గొప్ప గొప్ప విద్యా సంస్థలు లేవు. అన్నింటికీ మించి నిత్యం ఉగ్రవాదుల అలికిడి. ఎక్కడ ఎలాంటి బాంబులు పేలుతాయో తెలియదు. దేశంలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అర్థం కాదు. కనీసం 24 గంటల పాటు కరెంటు ఉండదు. తాగడానికి నీరు లభించదు. తినడానికి తిండి అందుబాటులో ఉండదు. ఇక మిగతా వాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అందువల్లే పాకిస్తాన్ దేశస్తులు తమ మాతృదేశంలో ఉండడానికి అంతగా ఇష్టపడరు. పైగా ఇతర దేశాల్లో చదువుకోవడానికి.. అక్కడే స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ దేశం వదిలిపెట్టి.. ఇతర దేశాలలో స్థిరపడుతున్నప్పటికీ పాకిస్తాన్ మూలాలు ఉన్న వారిలో మార్పు రావడం లేదు. పైగా వారు తమ దేశానికి మాత్రమే సాధ్యమైన పేటెంట్ రైట్స్ ను ఇతర దేశాల్లో చూపిస్తున్నారు. ఖండాలు దాటినా.. సముద్రాలు దాటి వెళ్లిపోయినా తమ బుద్ధిని ప్రదర్శిస్తున్నారు.
యునైటెడ్ కింగ్డమ్ లో పాకిస్తాన్ దేశస్థులు ఎక్కువగా ఉంటారు. చదువు నిమిత్తం, ఉపాధి నిమిత్తం ఈ దేశానికి వచ్చిన వారు అక్కడ స్థిరపడుతున్నారు. అలా యూకేలో స్థిరపడిపోయిన పాకిస్తాన్ జాతీయులు చాలామంది ఉన్నారు. ఉపాధి కోసం, చదువు కోసం యూకే వచ్చి సెట్ అయినవారు అలానే ఉంటే బాగుండేది. కాకపోతే వారు తమ పైత్యాన్ని.. తమకు మాత్రమే సొంతమైన దారుణమైన వ్యక్తిత్వాన్ని యూకే లో ప్రదర్శిస్తున్నారు. ఇటీవల యూకే లో జరుగుతున్న నేరాలకు సంబంధించి ఒక నివేదిక బయటికి వచ్చింది. ఈ నివేదికను యూకే హోంశాఖ బయటికి విడుదల చేసింది. దానిని ఓ పాత్రికేయుడు విశ్లేషించి.. తనదైన వివరాలను వెల్లడించాడు.. ఆ వివరాలు మైండ్ బ్లాంక్ అయ్యేవిధంగా ఉన్నాయి.
యూకే లో అఘాయిత్యాలు, దారుణాలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. ముఖ్యంగా మహిళలపై దారుణాలు విపరీతంగా చోటు చేసుకుంటున్నాయి. అయితే మహిళలపై ఈ స్థాయిలో దారుణాలకు పాల్పడుతున్న వారిలో పాకిస్తాన్ దేశస్తులు ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. యునైటెడ్ కింగ్డమ్ లో గత 20 ఏళ్ల రికార్డులను పరిశీలిస్తే.. నేరస్తులలో ఏకంగా 83% పాకిస్తాన్ దేశం నుంచి వచ్చిన వారని తెలుస్తోంది. శాశ్వత పౌరసత్వం కోసం.. ఆర్థిక అవసరాల కోసం మహిళలను ట్రాప్ చేయడం.. ఆ తర్వాత వారిపై దారుణాలకు పాల్పడటం వంటి సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిలో పాకిస్తాన్ దేశస్తులు ఎక్కువగా ఉన్నారు. తమ అవసరం తీరిపోయిన తర్వాత మహిళలపై వారు దారుణాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.. అయితే లండన్ పోలీసులు కేసులు నమోదు చేసి.. శిక్షలు పడే విధంగా చేస్తున్నప్పటికీ నేరాలు తగ్గడం లేదని తెలుస్తోంది.