Congress Sonia Gandhi : రెండు సార్లు అధికారానికి దూరం.. కాంగ్రెస్ ఇప్పట్లో పుంజుకోవడం కష్టమేనన్న అంచనాలు.. 2014లో మొదలైన కాంగ్రెస్ పై వ్యతిరేకత ఇప్పటికీ కొనసా….గుతూనే ఉంది. సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చి.. అస్సలు బలం లేని బీజేపీని ఒంటరి పోరాటంతో మోడీ గద్దెనెక్కించాడు.. తన పాలనతో.. గుజరాత్ మోడల్ అభివృద్ధితో మోడీ మరోసారి ప్రజల అభిమానం చూరగొని రెండోసారి గెలిచారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో పవర్ ఫుల్ శక్తిగా వెనుకాల ఉండి ప్రధానమంత్రులను డిసైడ్ చేసి పాలించిన సోనియా గాంధీ ఇప్పుడు ఎందుకు కొరకరాని మౌన అధినేత్రిగా మిగిలిపోయారు. ఆమె వ్యూహాలు ఫలించడం లేదు. కాంగ్రెస్ లోని కుమ్ములాటలు, అసమ్మతి తగ్గడం లేదు. 2014లో వ్యతిరేకతతో ఓడిన కాంగ్రెస్, 2019కి వచ్చేసరికి అస్సలు బలం లేని చతికిలపడ్డ పార్టీగా కుదేలైంది. పైకి లేపాల్సిన రాహుల్ గాంధీ మరింత దిగజార్చాడన్న అపవాదును మూటగట్టుకున్నారు. ఇక భవిష్యత్తులోనూ అధికారంలోకి వచ్చే సూచనలు మచ్చుకైనా కనిపించడం లేదు. మరి కాంగ్రెస్ బతకాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే కాంగ్రెస్ బతికి బట్టకడుతుందన్న దానిపై స్పెషల్ ఫోకస్..
మొన్నటికి మొన్న పంజాబ్ లో కాంగ్రెస్ సీనియర్ నేత సీఎం అమరీందర్ ను మార్చి చన్నీకి బాధ్యతలు ఇచ్చి సిద్ధూతో ఎన్నికలకు వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడ ఘోర ఓటమికి కారణమయ్యారు. ఆమ్ ఆద్మీకి పువ్వుల్లో పెట్టి అధికారం అప్పగించారు. పాత చింతకాయపచ్చడి లాంటి కాంగ్రెస్ వ్యూహాలు ఇఫ్పుడు పనిచేయడం లేదు. యువతకు అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ కురువృద్ధుల రాజకీయాలు ఆ పార్టీ పుట్టి ముంచుతున్నాయ. రాహుల్ వైదలగడం.. వృద్దాప్యంలో సోనియాతో పార్టీ వ్యవహారాలు చేతకాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో అంపశయ్య ప్రాణాలతో పోరాడుతున్నట్టుగా ఉంది. ఇది కాంగ్రెస్ కు లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారింది.
కాంగ్రెస్ ను ఇప్పుడు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలను సాగనంపాల్సిన తరుణం వచ్చేసింది. ఇదే సమయంలో పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త జనరేషన్ తోనే కాంగ్రెస్ తలరాత మారే అవకాశం ఉంది.
Also Read: ‘ది కశ్మీర్ ఫైల్స్’ గొప్పతనం గురించి చెప్పిన ఆర్జీవీ
2004లో మెజార్టీ సాధించినా కూడా.. సోనియాగాంధీ విదేశీ వనితగా విమర్శలు రావడంతో ప్రధాని పదవిని త్యాగం చేశారు. తన స్థానంలో మన్మోహన్ సింగ్ ను నియమించి దేశాన్ని పాలించారు. కానీ తన కుటుంబంలోని రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలను గద్దెనెక్కించే ప్రయత్నం చేయలేదు. అదే కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు. నాడు అనుభవలేమి, అపరిపక్వతతో రాహుల్ కు పీఠం దక్కలేదు. ఇప్పుడు చేపడుదామన్న రాహుల్ కు అధికార పీఠం దక్కడం అసాధ్యంగా మారింది. రాహుల్ గాంధీ రాజకీయ అపరిపక్వతతో అసలు ప్రధాని పీఠమే దూరమైపోయింది.
2022లోనైనా కాంగ్రెస్ కథ మారాలంటే సోనియా గాంధీ తన పదవిని వదిలిపెట్టాలి. తన కుటుంబ సభ్యులను పక్కకు పెట్టాలి. అప్పుడే కాంగ్రెస్ బతికి బట్టకడుతుంది. సోనియా కేవలం రాహుల్, ప్రియాంకల తల్లిగానే కాదు.. ఇప్పుడు కాంగ్రెస్ కు తల్లిపాత్ర పోషించాలి. కాంగ్రెస్ బతికిబట్టకట్టాలంటే.. భవిష్యత్ ఉండాలంటే యువతకు అవకాశం ఇచ్చి భవిష్యత్ నేతలను తయారు చేయాలి. రాజకీయాల్లో బలమైన, మెరుగైన నేతలను గుర్తించి వారికి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలి.
కాంగ్రెస్ లో గాంధీల శకం ముగిసిందని సోనియాగాంధీ ఇప్పటికైనా తెలుసుకోవాలి. వారిని ప్రజలు నమ్మడం లేదని.. వారికి ఓటు వేసే పరిస్థితి లేదని గుర్తించాలి. ఆ కాలం మారిందన్న వాస్తవాన్ని గ్రహించాలి. అందుకే సోనియా గాంధీ ఇప్పుడు గొప్ప త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తను, తన ఫ్యామిలీని పక్కకు తప్పించి భవిష్యత్ నేతలకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించి ముందుకు సాగాల్సిన అవసరం అవసరం ఏర్పడిందంటున్నారు. మరణశయ్యపై ఉన్న కాంగ్రెస్ ను బతికించడానికి మరోసారి త్యాగం చేయాలని కాంగ్రెస్ వాదులు కోరుతున్నారు.
Also Read: చీప్ లిక్కర్ ను కనిపెట్టిన చీప్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు.. కొడాలి నాని ఆన్ ఫైరింగ్
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: The future of the congress is only if sonia gandhi leaves the presidency
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com