Viral Video : అవి జనాల్లో విపరీతమైన ప్రభావాన్ని చూపించాయి. ఫలితంగా బిజెపి అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. కర్ణాటకలో 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆది నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీలలో రెండు లేదా మూడు తొలగించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే గవ్యప్ప వ్యాఖ్యానించారు. దీనిపై షో కాజ్ నోటీసులు జారీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు. గవ్యప్ప చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో గవ్యప్ప ఈ వ్యాఖ్యలు చేశారు..” ఆరు గ్యారెంటీ ల కోసం ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. ఇలా నిధులను భారీగా వెచ్చించడం వల్ల ప్రజలకు పక్కా ఇళ్లు మంజూరు చేయలేకపోతున్నాం. అవసరం లేని గ్యారంటీలను కచ్చితంగా తొలగించాలి. ఆ నిధులను పేదల ఇళ్ల నిర్మాణానికి మళ్ళించాలని” గవ్యప్ప కోరారు. గవ్యప్ప చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాష్ట్రంలో దుమారాన్ని రేపుతున్నాయి.
బిజెపి నేతల విమర్శలు
గవ్యప్ప చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఇరకాటం లో పెట్టారు. “కమీషన్ సీఎం” అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పై నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేశారు. ఇది అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావం చూపించింది. అయితే నాడు తమపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన విమర్శలను.. నేడు తిప్పి కొట్టే అవకాశం వచ్చిందని బిజెపి నాయకులు భావిస్తున్నారు. గవ్యప్ప చేసిన వ్యాఖ్యలను ఆధారంగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు..” ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా స్కాం లో ఇరుక్కున్నారు.. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవి ఇలా ఉండగానే గవ్యప్ప లాంటి ఎమ్మెల్యేలు ఆరు గ్యారెంటీల బండారాన్ని బయటపెట్టారు. ఇప్పటికైనా కర్ణాటక ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు. అమలు చేసే అవకాశం కూడా లేదని” బిజెపి నాయకుడు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, గవ్యప్ప చేసిన వ్యాఖ్యల పట్ల ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉండడంతో షోకాజ్ నోటీస్ జారీ చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీలలో రెండు లేదా మూడు తొలగించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే గవ్యప్ప వ్యాఖ్యానించారు. దీనిపై షో కాజ్ నోటీసులు జారీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు. #karnataka#Congress pic.twitter.com/ePydKYOVpi
— Anabothula Bhaskar (@AnabothulaB) November 26, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Dk shivakumar announced that show cause notices will be issued over the comments made by congress party mla gavyappa
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com