HomeతెలంగాణTelangana Thalli Statue : తెలంగాణ తల్లికి కొత్త రూపం.. సోషల్‌ మీడియాలో విగ్రహం నమూనా...

Telangana Thalli Statue : తెలంగాణ తల్లికి కొత్త రూపం.. సోషల్‌ మీడియాలో విగ్రహం నమూనా చిత్రం వైరల్‌!

Telangana Thalli Statue : తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ 2014లో అధికారంలోకి వచ్చిన సమయంలోనే తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేయించింది. పలు నమూనాలు పరిశీలించిన తర్వాత నాటి సీఎం కేసీఆర్‌ ప్రస్తుతం ఉన‍్న విగ్రహానికి ఆమోదం తెలిపారు. పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. తెలంగాణ తల్లి విగ్రహం సంపన్నుల బిడ్డగా తయారు చేయించారని, నిజమైన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే నూతన విగ్రహం ఏర్పాటు చేయాలని భావించింది. అయితే హడావుడి నిర్ణయంతో విమర్శలు వస్తాయని వాయిదా వేసింది. తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు అయిన డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర సెక్రటేరియేట్‌ ఆవరణలో ఏర్పాటు చేయాలని నిర‍్ణయించారు. ఈమేరకు నూతన విగ్రహాన్ని సచివాలయానికి తీసుకువచ్చారు. అయితే కనిపించకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో కొత్తగా ఏర్పటు చేసే తెలంగాణ తల్లి ఎలా ఉంటుంది అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది.

కొత్త రూపం ఇలా..
తెలంగాణ తల్లి కొత్త రూపం మరో రెండు రోజల్లో అందరికీ కనిపించనుంది. అయితే తాజాగా కొన్ని ఫొటోలు తెలంగాణ తల్లి విగ్రహం అని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తెలంగాణ ఆడబిడ్డను గుర్తుచేసేలా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలోనే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే విగ్రహం తయారు చేయించారని తెలుస్తోంది. తెలంగాణ సామాన్య మహిళ రూపొ ఆకట్టుకునేలా ఉంది. ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి దర్శనమిస్తోంది. చేతిలో మట్టి గాజులతో తెలంగాణ సం‍స్కృతి, సంప్రదాయాలకు నిండుదనం తీసుకొచ్చేలా రూపొందించారు.

డిసెంబర్‌ 9 ఆవిష్కరణ..
తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని డిసెంబర్‌ 9న ఆవిష్కరించాలని నిర్ణయించారు. బంగారు రంగు అంచుతో ఉన‍్న ఆకుపచ్చ చీర, ఎడమ చేతిలో వరి కంకి, మొక‍్కజొన్న కంకి, సజ్జ కంకి ఉండేలా తయారు చేశారు. పోరాట స్ఫూర్తిని తెలిపేలా పిడికిళ్లతో తెలంగాణ తల్లి కొత్త విగ్రహం చూడ ముచ్చటగా ఉంది.

విగ్రహం ప్రత్యేకతలివే:

– ఆకుపర్చ చీర
– ఎడమ చేతిలో వరికంకి, మొక్కజొన్న కంకి, సజ్జ కంకి
– మెడలో తెలంగాణ పల్లె ఆడపడుచులు ధరించే తీగ
– చేతులకు ఆకుపచ్చ రంగు మట్టి గాజులు
– బంగారు అంచు ఉన్న ఆకుపచ్చ చీర
– పోరాట సూ‍్ఫర్తిని చాటేలా బిగించిన పిడికిళ్లు
– అభయహస్తంతో తెలంగాణకు ఆశీస్సులు
– నుదుట ఎర్రటి కుంకుమ బొట్ట
– చెవులకు కమ్మలు

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular