https://oktelugu.com/

KTR : కేటీఆర్‌ను భయపెడుతున్న యూట్యూబ్‌ ఛానెళ్లు!

ఇక వ్యూస్ కోసం ఎవరు ట్రెండింగ్‌లో ఉంటే వారిపై థంబ్ నెయిల్స్ తో విరుచుకుపడుతూంటాయి. అలాంటి వాటిని కట్టడి చేయడం సాధ్యం కాదని ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కూ తెలుసు. అయినా బెదిరించాలన్న ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. కానీ ఇది రివర్స్ అయ్యే అవకాశం ఉంది.

Written By: NARESH, Updated On : April 1, 2024 8:17 am
ktr

ktr

Follow us on

KTR : తెలంగాణ మాజీ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారక రామారావును యూట్యూబ్‌ ఛానెళ్లు భయపెడుతున్నాయి. వాటిలో వస్తున్న కథనాలు చూడగానే ఆయనకు ఎక్కడో కాలుతున్నట్లు ఉంది. ఆ ఛానెళ్ల పేర్లు వినగానే అంత ఎత్తున ఎగిరి పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ ఓటమికి యూట్యూబ్‌ ఛానెళ్లు కారణమని ఆరోపించారు. తమకు యూట్యూబ్‌ ఛానెళ్లు లేకపోవడం ఓ కారణమని ప్రకటించారు. ఇటీవల తమను యూట్యూబ్‌ ఛానెళ్లు టార్గెట్‌ చేస్తున్నాయి. తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలో 16 మీడియా సంస్థలకు నోటీసులు ఇప్పించారు. తాజాగా మరికొన్ని ఛానెళ్ల యాజమాన్యాకు నోటీసులు పంపించారు.

తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని..
తమపై కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్తు దురుద్దేశంతో తప్పుడు వార్తలు ప్రసాచం చేస్తున్నాయని టీవీ, సోషల్‌ మీడియా ఛానెళ్ల యాజమాన్యాలకు తాజగా లీగల్‌ నోటీసులు పంపించారు. తనకు సంబంధం లేని వాటికి తన పేరు, ఫొటోలు ప్రస్తావిస్తున్న మీడియా సంస్థలు, యూట్యూబ్ చానెళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, పరువు నష్టం కేసులు పెడతానని కేటీఆర్ హెచ్చరించారు. తమకు, తమ కుటుంబానికి సంబంధం లేని విషయాల్లో దురుద్దేశపూరితంగా ప్రచారం చేస్తున్న వీడియోలను వెంటనే తొలగించాలని లీగల్‌ నోటీసుల్లో సూచించారు. పక్కా ప్రణాళికతో కొన్ని ఛానెళ్లు, మీడియా సంస్థలు దుష్ఫ్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కుట్ర, ఎజెండాలో భాగంగా తనపై జరుగుతున్న ప్రచారాన్ని చట్టపరంగా ఎదుర్కొంటానని హెచ్చరించారు.

పేర్లు, ఫొటోల ప్రస్తావనపై అభ్యంతరం..
తమకు సంబంధం లేని విషయాల్లో తమ పేరు‍్ల, ఫొటోలతో చెత్త థంబ్‌నెయిల్స్‌ పోస్ట్‌ చేస్తున్న ఈ ఛానళ్లపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్‌ హెచ్చరించారు. ఇదిలా ఉండగా కేటీఆర్ తీరుపై బీఆర్ఎస్ నాయకులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మీడియాను మేనేజ్‌ చేసిన కేటీఆర్‌, ఇప్పుడు వాటిలో వస్తున్న కథనాలను చూసి భయపడుతుండడం చూసి ఆశ్చర్యపోతున్నారు.

వాళ్లకో నీతి..
ఇదిలా ఉండగా, తమపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని యూట్యూబ్‌ ఛానెళ్లు, మీడియా ఛానెళ్లపై ఆరోపణలు చేస్తున్న కేటీఆర్‌ తన సొంత మీడియాలో మాత్రం చంద్రబాబు, రేవంత్‌రెడ్డిపై తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానెళ్లలో ప్రసారం యూడా చేయిస్తున్నారు. ఒక వేలు ఎదుటివారిని చూపితే.. మిగతా నాలుగు వేళ్తు మనల్ని చూస్తాయన్న విషయం కేటీఆర్‌ మర్చిపోయారు. బీఆర్‌ఎస్‌ మీడియా ప్రసారం చేస్తున్న వీడియోలు, ఫొటోల కన్నా తాము తక్కువే ప్రసారం చేస్తున్నామని యూట్యూబ్ ఛానెళ్లు పేర్కొటున్నాయి. ఇక వ్యూస్ కోసం ఎవరు ట్రెండింగ్‌లో ఉంటే వారిపై థంబ్ నెయిల్స్ తో విరుచుకుపడుతూంటాయి. అలాంటి వాటిని కట్టడి చేయడం సాధ్యం కాదని ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కూ తెలుసు. అయినా బెదిరించాలన్న ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. కానీ ఇది రివర్స్ అయ్యే అవకాశం ఉంది.