DC Vs CSK: మతిశ క్యాచ్.. డేవిడ్ వార్నర్ మతిపోయింది.. వీడియో వైరల్

ఢిల్లీ, చెన్నై జట్టు ఐపిఎల్ 17వ సీజన్లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్లో ఆదివారం రాత్రి తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు ఐదు వికెట్లకు 191 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ బ్యాటింగ్ ఆకట్టుకుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 1, 2024 8:12 am

DC Vs CSK

Follow us on

DC Vs CSK: బ్యాటింగ్ చేస్తోంది ప్రమాదకరమైన డేవిడ్ వార్నర్.. బంతి వేస్తోంది ముస్తాఫిజుర్ రెహమాన్.. అలా బంతి వేశాడో లేదో.. వార్నర్ స్కూప్ షాట్ ఆడాడు. బంతి గాల్లోకి లేచింది. అదే సమయంలో చెన్నై ఆటగాడు మతీష పతిరణ గాల్లోకి అమాంతం లేచాడు. వంటి చేత్తో క్యాచ్ పట్టాడు. ఫలితంగా డేవిడ్ వార్నర్ అవుట్ అయ్యాడు. పతిరణ క్యాచ్ పట్టిన విధానాన్ని చూసి బిత్తర పోయాడు. కొంతసేపు మైదానంలో అలానే ఉండిపోయాడు. నమ్మశక్యం కాని క్యాచ్ పట్టిన పతిరణను మనసులో అభినందించుకుంటూ వెళ్లిపోయాడు.

ఢిల్లీ, చెన్నై జట్టు ఐపిఎల్ 17వ సీజన్లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్లో ఆదివారం రాత్రి తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు ఐదు వికెట్లకు 191 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ బ్యాటింగ్ ఆకట్టుకుంది. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ ఆడిన తీరు అభిమానులను అలరించింది. అయితే డేవిడ్ వార్నర్ అవుట్ అయిన విధానం కూడా అభిమానులను షాక్ కు గురిచేసింది. పదో ఓవర్ మూడో బంతిని ముస్తాఫిజుర్ స్లోయర్ ఫుల్ టాస్ వేశాడు. దానిని డేవిడ్ వార్నర్ రివర్స్ స్కూప్ విధానంలో భారీ షాట్ ఆడాడు. బంతి కూడా మంచి స్ట్రోక్ లో తగలడంతో అమాంతం పైకి లేచింది. కానీ మతీష పతీరణ దానిని అద్భుతంగా డైవ్ చేసి ఒంటి చేత్తో అందుకున్నాడు.

ఈ క్యాచ్ చూసిన తర్వాత డేవిడ్ వార్నర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నిరాశతోనే మైదానాన్ని విడిపోయాడు. చెన్నై జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ క్యాచ్ చూసి వారెవ్వా అంటూ చప్పట్లతో పతీరణను అభినందించాడు.. ఈ క్యాచ్ చూసిన నెటిజన్లు కూడా అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా ఢిల్లీ జట్టు బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 191 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 52, పంత్ 51, పృథ్వీ షా 43 పరుగులతో అదరగొట్టారు. చెన్నై బౌలర్లలో మతీష మూడు వికెట్ల తీశాడు, ముస్తాఫిజుర్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. రోడ్డు ప్రమాదానికి గురై ఐపీఎల్ లో పునరాగమనం చేసిన తర్వాత తొలి రెండు మ్యాచ్లలో రిషబ్ పంత్ ఆకట్టుకోలేకపోయాడు.. మూడవ మ్యాచ్లో మాత్రం బ్యాట్ తో శివతాండవం చేశాడు. మొదటి 23 బంతుల్లో 23 పరుగులు చేసిన పంత్.. ఆ తర్వాతి 9 బంతుల్లో 23 పరుగులు పిండుకున్నాడు.