Women Officers Bribery: ఎవరు ఏమైనా అనుకోని.. చేయి తడిపితేనే పని” ఇదే సిద్ధాంతాన్ని ఈ మహిళా అధికారులు పాటించారు. తమ పని చేస్తున్న ప్రభుత్వ శాఖలలో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడ్డారు.. వివిధ పనుల నిమిత్తం తమ వద్దకు వచ్చే ప్రజలనుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. డబ్బులు ఇవ్వని వారి పనులను పక్కన పెట్టారు. తద్వారా భారీగా వెనకేసుకున్నారు. రోజులు మొత్తం ఒకేలా ఉండవు కాబట్టి.. వీరి లంచం వ్యవహారం బయటపడింది. చివరికి తెలంగాణ ఏసీబీ అధికారులు విస్తృతంగా నిర్వహించిన దాడుల్లో వీరి బాగోతం అందరికీ తెలిసిపోయింది.. ఇప్పుడు వారి జీవితం జైలు పాలైంది.
Also Read: ఆర్కేది పైత్యం.. జగదీశ్వర్ రెడ్డిది దౌత్యం.. ఇద్దరికీ ఇదే తేడా!
సాధారణంగా నేటి కాలంలో ఆడవాళ్లు సాధిస్తున్న విజయాలు మగవాళ్లకు కూడా అసూయ కలిగిస్తున్నాయి. అనేక అడ్డంకులను దాటుకొని.. అనేక కట్టుబాట్లను పక్కనపెట్టి ఆడవాళ్లు గెలుపులను సొంతం చేసుకుంటున్నారు. వివిధ రంగాలలో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు.. ఆకాశంలో సగం.. అవకాశాలలో సగం అని నిరూపిస్తున్నారు. అయితే కొంతమంది మహిళ అధికారులు మాత్రం అవినీతిలో పురుష అధికారులతో పోటీపడుతున్నారు. గతంలో అవినీతి నిరోధక శాఖ దాడులు చేసినప్పుడు పురుష అధికారులు మాత్రమే పట్టుబడేవారు. వారు మాత్రమే జైలుకు వెళ్లేవారు. కానీ నేటి కాలంలో పురుషులను మహిళా అధికారులు డామినేట్ చేస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ వెల్లడించిన గణాంకాలు ఇందుకు నిదర్శనం గా నిలుస్తున్నాయి.. సంబంధిత శాఖలో మహిళా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించి.. భారీగా లంచాలు వసూలు చేస్తున్నారు. అయితే కొంతమంది అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించడంతో ఈ మహిళ అధికారుల బండారం బయటపడింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ చేసిన దాడుల్లో ఈ ఏడాది ఇప్పటివరకు 18 మంది మహిళ అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డారు.. వేల నుంచి మొదలు పెడితే లక్షల వరకు లంచాలు తీసుకుంటూ దొరికిపోయారు.. పైగా లంచాలు తీసుకునే విషయంలో వీరు డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం.. ఇక పురుష అధికారులలో వంద మందికి పైగా ఆఫీసర్లు ఏసీబీ అధికారుల దాడుల్లో పట్టుబడ్డారు.. అయితే మహిళా అధికారులు ఎక్కువగా రెవెన్యూ, ఇరిగేషన్, హైదరాబాద్ మహానగర పాలక సంస్థల పరిధిలో పని చేసేవారే ఏసీబీ దాడుల్లో పట్టుబడడం విశేషం..”మహిళా అధికారులు ఇటీవల మేము చేస్తున్న దాడుల్లో దొరికిపోతున్నారు.. లంచాలు వసూలు చేసే విషయంలో మహిళా అధికారులు ఏమాత్రం తగ్గడం లేదు. గతంలో మహిళ అధికారుల్లో కొంత భయం ఉండేది.
Also Read: అరె.. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు పెద్ద చిక్కే వచ్చిపడిందే!
కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది. పైగా డబ్బులు వసూలు చేసే విషయంలో వారు డిమాండ్ పూర్వక వైఖరి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా అధికారులపై ఫిర్యాదులు పెరిగిపోయాయి..పక్కా ఆధారాలతో రంగంలోకి దిగిన తర్వాత.. ఇటువంటి లంచగొండి అధికారులను పట్టుకుంటున్నాం.. ఆధారాలతో సహా వారిని చట్టం ముందు దోషులుగా నిలబెడుతున్నామని” అవినీతి నిరోధక శాఖ అధికారులు అంటున్నారు.