Extramarital Affair Crime: ఆమెను ప్రేమగా చూసుకున్నాడు. తన జీవితంలోకి వచ్చిందని విమర్శిపోయాడు. తన జీవితంలో సగభాగమని గొప్పగా చెప్పుకున్నాడు. తన ప్రేమ మొత్తం ఆమెకే సొంతమని.. ఆమె కూడా తనకే సొంతమని భావించాడు. కానీ ఆమె మాత్రం అందుకు విరుద్ధంగా ఆలోచించింది. భర్త ఉండగానే మరో వ్యక్తికి దగ్గర అయింది. భర్తను పక్కనపెట్టి అతడితో శారీరక సుఖంలో మునిగిపోయింది. చివరికి భర్త అంటే ఆమె దృష్టిలో ఒక పనికిరాని వ్యక్తి అనుకుంది. తనకు అడ్డువస్తున్నాడని తొలగించుకుంది.. ఈ వ్యవహారంలో ఆమె సాగించిన తీరు.. వ్యవహరించిన విధానం పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
Also Read: ఆకాశంలో సగం.. అవినీతిలోనూ సగం..ఏం మహిళాధికారులమ్మా!
ఢిల్లీలో కరణ్ దేవ్ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నా కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కరణ్ కు భార్య సుస్మిత ఉంది. సుస్మిత కొద్ది రోజులపాటు కరణ్ తో బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఆమె కరణ్ మేనల్లుడు రాహుల్ మైకంలో మునిగిపోయింది. చేస్తున్నది తప్పు అని తెలుసు.. వావివరస లేకుండా చేస్తున్న ఈ పని దారుణం అని కూడా తెలుసు.. అయినప్పటికీ సుస్మిత తన బంధాన్ని నిరాటంకంగా కొనసాగించింది. రాహుల్ కు సర్వం సమర్పించింది. భర్తను పూర్తిగా దూరం పెట్టింది. ఒకరోజు రాహుల్ సుస్మిత ఏకాంతంగా ఉండగా కరణ్ చూశాడు. భార్యను బెదిరించాడు. ఇలాంటి వ్యవహారం తప్పు అని సూచించాడు. అయినప్పటికీ ఆమె తన తీరు మార్చుకోలేదు. పైగా మరింత రెచ్చిపోయింది. ఆకాశమే హద్దుగా చలరేగిపోయింది. తమ బంధానికి కరణ్ ఎప్పుడైనా ముప్పు అని భావించిన సుస్మిత అతడిని అడ్డు తొలగించుకోవాలని భావించింది. తన ప్రియుడితో ఫోన్ మాట్లాడితే దొరికిపోతానని భావించిన ఆమె.. వాట్సాప్ కాల్ చేయడం మొదలు పెట్టింది. ఇన్ స్టా లో చాట్ చేయడం ప్రారంభించింది.. అందులోనే వారిద్దరు కరణ్ ను అంతం చేయడానికి ప్రణాళిక రూపొందించారు. రూపొందించిన ప్రణాళిక ఆధారంగానే అతడిని అంతం చేశారు.
కరణ్ కు అంతం చేయడానికి ముందు కొద్దిరోజులపాటు సుస్మిత మంచిగా మాట్లాడింది. ప్రవర్తన మార్చుకుంటానని నమ్మబలికింది. భార్య చెప్పింది నిజం అని భావించిన కరణ్ ఆమె చెప్పిన మాటలను నమ్మాడు. ఈ నేపథ్యంలోనే సుస్మిత కరణ్ కు భోజనం పెట్టింది. ముందుగానే అందులో 15 నిద్ర మాత్రలు వేసింది. అది గమనించని కరణ్ ఆహారం తిన్నాడు. ఆ తర్వాత మాత్రల ప్రభావం వల్ల గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. ఇదే అదునుగా అతడిని సుస్మిత అంతం చేసింది. కరణ్ తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది.. అతడు నిద్రలోకి జారుకుంది.. ఈ విషయాలు మొత్తం రాహుల్ తో చెప్పింది. ఎప్పుడైతే కరణ్ నిద్రలోకి జారుకున్నాడో అప్పుడే రాహుల్ స్పందించాడు. అతడికి విద్యుత్ షాక్ ఇచ్చి చంపమని చెప్పాడు.. దీంతో అతను చెప్పినట్టుగానే సుస్మిత కరణ్ కు విద్యుత్ షాక్ ఇచ్చింది. మొత్తంగా కరణ్ విద్యుత్ షాక్ తో చనిపోయాడని సుస్మిత నమ్మబలికింది. అయితే సుస్మిత ఫోన్ పరిశీలించగా ఇన్ స్టా చాట్ లో ఈ వివరాలు మొత్తం ఉన్నాయి. దీంతో కరణ్ సోదరుడు ఈ విషయం పోలీసులకు చెప్పాడు. దీంతో వారు రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టారు. అనంతరం సుస్మితను, రాహుల్ ను అదుపులోకి తీసుకున్నారు.
Also Read: అరె.. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు పెద్ద చిక్కే వచ్చిపడిందే!
ఈ సంఘటన ఢిల్లీ నగరంలో సంచలనం సృష్టించింది. వాస్తవానికి సుస్మిత ఈ తరహాలో దారుణానికి పాల్పడుతుందని తమ ఊహించలేదని స్థానికులు చెబుతున్నారు.. భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉండేవారని.. సుస్మిత ఇంతటి దారుణానికి పాల్పడిందంటే నమ్మలేకపోతున్నామని చుట్టుపక్కల వారు చెబుతున్నారు.. కరణ్ ను అంతం చేసిన సుస్మిత పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు