Lock down again: తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ ఉంటుందా? ఏమేం ఆంక్షలంటే?

Lock down again: భారత్ లోకి ఒమ్రికాన్ వైరస్ కొద్దిరోజుల క్రితమే ఎంట్రీ ఇచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒమ్రికాన్ కేసులు నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఒమ్రికాన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ ఉంటుందా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను అడ్డుకునేందుకు పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నాయి. ఈనేపథ్యంలో గతంలో మాదిరిగా పూర్తి లాక్డౌన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే కేసులు పెరిగే ప్రాంతాల్లో ఆంక్షలతో కూడిన […]

Written By: NARESH, Updated On : December 16, 2021 12:18 pm
Follow us on

Lock down again: భారత్ లోకి ఒమ్రికాన్ వైరస్ కొద్దిరోజుల క్రితమే ఎంట్రీ ఇచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒమ్రికాన్ కేసులు నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఒమ్రికాన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ ఉంటుందా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను అడ్డుకునేందుకు పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నాయి.

Lock down again

ఈనేపథ్యంలో గతంలో మాదిరిగా పూర్తి లాక్డౌన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే కేసులు పెరిగే ప్రాంతాల్లో ఆంక్షలతో కూడిన లాక్డౌన్ ఉంటుందని స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఈ విషయంపై తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాస్ ప్రజలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒమ్రికాన్ వైరస్ డెల్టా వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తుందని, గాలి ద్వారా కూడా సోకుందని స్పష్టమైందని తెలిపారు.

ఈనేపథ్యంలో ప్రజలంతా తప్పనిసరిగా మాస్కు ధరించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైరస్ సోకిన వ్యక్తి దగ్గినపుడు, తుమ్మినపుడు గాలిలో సూక్ష్మరేణువులు కొద్దిసేపు తేలియాడుతుంటాయన్నారు. ఈప్రాంతంలో ఇతరులు గాలి పీల్చినపుడు వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. అందుకే ప్రతీఒక్కరూ మాస్కును ఇంటా బయటా తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

విదేశాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులకు ఒమ్రికాన్ వైరస్ సోకిందని తెలిపారు. తెలంగాణలోని ఏ ఒక్కరికి ఒమ్రికాన్ సోకలేదని స్పష్టం చేశారు. ఒమ్రికాన్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణలో రోజుకు 40వేల కరోనా టెస్టు చేస్తున్నామని వీటిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

విమానాశ్రయాల్లో కరోనా టెస్టులను పకడ్బంధీగా చేపడుతున్నటు చెప్పారు. ముప్పులేని దేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్ వస్తే హోం ఐసోలేషన్లో ఉంచుతున్నామని పేర్కొన్నారు. ఒమ్రికాన్ అని తేలితే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. నిన్న విదేశాల నుంచి రాష్ట్రానికి 1,248మంది రాగా వీరిలో ముగ్గురికి పాజిటివ్ అని తేలందన్నారు.

Also Read: తెలంగాణలో ఎంటరైన ‘ఒమిక్రాన్’.. హై అలర్ట్ ప్రకటించిన వైద్యారోగ్య శాఖ!

వీరికి ఒమ్రికాన్ ఉందా? లేదా అన్నది తేలాల్సి ఉందన్నారు. రిపోర్టులు రాగానే వివరాలను వెల్లడించన్నట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వైద్యారోగ్య శాఖపై నిత్యం సమీక్షలు చేస్తూ వారికి సలహాలు, సూచనలు చేస్తున్నారు.

ప్రజలంతా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచిస్తున్నారు. అవసరాన్ని బట్టి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ చేపట్టాలని సూచించారు. ఏదిఏమైనా ప్రతీఒక్కరు మాస్కు ధరించాల్సిందే. లేకుంటే భారీగా జరిమానాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Also Read: త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ.. మంత్రి రేసులో కవిత, కడియం, ప్రకాశ్..?