https://oktelugu.com/

Liger Movie: అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చిన “లైగర్”… విజయ్ దేవరకొండ

Liger Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘లైగ‌ర్‌’. బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఛార్మితో క‌లిసి పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై నిర్మిస్తున్నారు. అలాగే ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 16, 2021 / 10:42 AM IST
    Follow us on

    Liger Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘లైగ‌ర్‌’. బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఛార్మితో క‌లిసి పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై నిర్మిస్తున్నారు. అలాగే ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్‌ను ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో నటిస్తుండడం మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. కాగా ఇప్పుడు తాజాగా లేటెస్ట్‌గా లైగర్ సినిమా నుంచి డబుల్ ధమాకా ఇచ్చాడు విజయ్ దేవరకొండ. మూవీకి సంబంధించి రెండు అప్ డేట్స్ ఇచ్చారు మేకర్స్.

    Liger Movie

    Also Read: ఫస్ట్ టైమ్ ఆర్‌ఆర్‌ఆర్ కోసం ఆ పని చేస్తున్న తారక్… ఏంటి అంటే

    ‘లైగర్’ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 25న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. అలానే కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 31న ‘లైగర్’ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నట్లు మరో గిఫ్ట్ ను అందించారు. ఈ సినిమాను తెలుగు, హిందీల్లో రూపొందించినప్పటికీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. అంటే లైగర్ పాన్ ఇండియా రేంజ్ మూవీగా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది. తమ అభిమాన రౌడీ హీరోను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామా అని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ఇప్పటికే తుది ద‌శ‌కు చేరుకుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను స‌రికొత్త లుక్‌, క్యారెక్ట‌రైజేష‌న్‌తో పాటు ప ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.

    https://twitter.com/Charmmeofficial/status/1471337664947187713?s=20

    Also Read: నెటిజన్​ కామెంట్​కి దిమ్మతిరిగే కౌంటర్​ ఇచ్చిన రష్మిక