https://oktelugu.com/

KTR: కేటీఆర్ ను ఈరోజు అరెస్ట్ చేస్తారా? వేగంగా మారుతున్న పరిణామాలు

ఈ-రేస్ కేసు విషయంలో ఏసీబీ కేటీఆర్ ను విచారణకు పిలిచింది. ఆయన తన లీగల్ టీంతో నంది హిల్స్ నుంచి బయల్దేరి వెళ్లారు. ఆయన వెళ్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

Written By:
  • Mahi
  • , Updated On : January 6, 2025 / 12:34 PM IST

    KTR(3)

    Follow us on

    KTR: ఈ-రేస్ కేసు కేటీఆర్ కు రోజు రోజుకు ఉచ్చు బిగుస్తోంది. ఈ ఫార్ములా ఈ రేస్ కేసు విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి సోమవారం (జనవరి 06) చేరుకున్నారు. ఆయన దాదాపు 10 గంటల ప్రాంతంలో నందినగర్‌లోని ఆయన నివాసం నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన లీగల్ టీమ్‌తో కలిసి ఏసీబీ కార్యాలయానికి బయల్దేరి వెళ్లారు. కేటీఆర్ విచారణకు వస్తున్నాడన్న విషయం తెలియడంతో ఆయన నివాసంతో పాటు, పార్టీ ఆఫీసుకు మాజీ మంత్రులు, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. ఏసీబీ ఆఫీస్ కు చేరుకున్న కేటీఆర్ మాట్లాడుతూ.. ఫార్ములా ఈ-రేస్ కేసులో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిందని, తనను విచారణకు పిలవనవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రేవంత్ రాజ్యం నడుస్తోందని ఆయన ఆరోపించారు. తమ వెంట మా పార్టీ లీగల్ టీం వస్తే అధికారులకు వచ్చిన ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. చట్టాలకు తలవంచి మాత్రమే తాను విచారణకు వచ్చానని కేటీఆర్ అన్నారు. ఇక్కడ తను విచారణలో ఉండగా మా ఇంటిపై రైడ్స్ కు ప్లాన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. తమపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. ఎన్ని డ్రామాలాడినా.. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. భయపడేది లేదన్న ఆయన ఈ విషయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు.

    పట్నం నరేందర్ రెడ్డి విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే కుట్రలు చేసిందని, ఈ విషయంలో పోలీసులు దొంగ స్టేట్మెంట్లు సృష్టించారని మండిపడ్డారు. నరేందర్ రెడ్డికి జరిగిందే తనకూ జరుగుతుందన్నారు. తీర్పు రిజర్వ్‌లో ఉండగా డ్రామాలు ఎందుకు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ ఇచ్చిన పత్రాలను నా ఇంట్లో పెట్టించి నన్ను ఇరికించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఫార్ములా ఈ-రేసు సమయంలో తాను మంత్రిగా నిర్ణయం తీసుకున్నానని.. దీనికి సంబంధించిన సమాచారం ఏసీబీ వద్ద ఉందని కేటీఆర్ అన్నారు.

    కాగా, ఐఏఎస్ అధికారి దానకిశోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఈ-రేస్ కేసులో ఏసీబీ కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనుంది. అవినీతి నిరోధక చట్టంలోని 13 (1) (a), (13)2, IPC 409 రెడ్ విత్ 120 B ప్రకారం ఏసీబీ కేసులు నమోదు చేసింది. కేసులో ఏవన్ గా కేటీఆర్, ఏ టూగా అరవింద్ కుమార్, ఏ త్రీగా బీఎల్ఎన్ రెడ్డి పేర్లను ఏసీబీ చేర్చింది.

    కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేటీఆర్, కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ గా ఉన్నారు. కేసీఆర్ హయాంలో ఓటుకు నోటు చేసుకు తీసుకువచ్చిన రేవంత్ ను తెగ ఇబ్బంది పెట్టిన కేసీఆర్, కేటీఆర్ కు తన హయాంలో ఈ – రేస్ కేసు బాగానే చిక్కిందన్న వాదనలు ఉన్నాయి. అయితే కేటీఆర్ మాత్రం దీన్ని లెక్క చేయనట్లుగా కనిపిస్తుంది. ఈ కేసును ఆయన చాలా లైట్ గా తీసుకుంటున్నారని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది.