https://oktelugu.com/

HMPV Virus In India: భారత్ లోకి తొలి చైనా కేసు.. బెంగళూరులో గుర్తింపు.. దేశమంతా విస్తరిస్తుందా..? కలకలం

చైనాలో ఇటీవల పుట్టిన మరో వైరస్ హచ్ఎంపీవీ తరహాలోనే ఒక కేసు భారత్ లో నమోదైందని వార్తలు వినిపిస్తున్నాయి. బెంగళూరులో ఎనిమిది సంవత్సరాల చిన్నారికి సంబంధించి నమూనాలను పరిశీలించగా అది అదే వైరస్ అన్న అనుమానాలు ఉన్నాయి. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపై..

Written By:
  • Mahi
  • , Updated On : January 6, 2025 / 12:30 PM IST

    HMPV Virus In India

    Follow us on

    HMPV Virus In India: చైనా వాటి ఉత్పత్తుల్లో వైరస్ లను కూడా చేర్చింది కాబోలు.. ఒక వైరస్ తర్వాత మరో వైరస్ ను ప్రపంచానికి ఎగుమతి చేస్తుంది. ఆ దేశం ఆ వైరస్ తో ఎలా ప్రభావితం అవుతుందో తెలియదు గానీ.. ప్రపంచం మాత్రం చైనా నుంచి వచ్చే వైరస్ తో అల్ల కల్లోలం అవుతోంది. గతంలో కొవిడ్ (కరోనా) ను ఎగుమతి చేసిన చైనా ఇప్పుడు హెచ్ఎంపీవీ (HMPV)ని ప్రపంచంపై ఎక్కు పెట్టింది. ఈ వైరస్ పేరు వింటే ఇప్పుడు ప్రజలతో పాటు శాస్త్రవేత్తలు కూడా జంకుతున్నారు. ఇది కూడా శ్వాస వ్యవస్థపై దాడి చేస్తుందని ఇప్పటికే నిర్ధారణ జరిగింది. దీనికి కూడా ఇప్పటికీ మందు గానీ, వ్యాక్సిన్ గానీ కనిపెట్టలేదు. ఈ వైరస్ తమ దేశానికి ఎక్కడ వస్తుందోనని వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు ఆందోళన చెందుతున్నారు. భారత్‌లో వైరస్‌ను గుర్తించినట్లు అధికారులు చెప్తున్నారు. బెంగళూరులో 8 నెలల చిన్నారిలో హెచ్ఎంపీవీ పాజిటివ్‌గా వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనిపై ఆ రాష్ట్రమైన కర్ణాటక ప్రభుత్వం వేగంగా స్పందించింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను చెప్పింది. రాష్ట్రంలోని ల్యాబ్‌లో ఈ పరీక్ష చేయలేదని చెప్పింది. ఆ రిపోర్టు ఓ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి వచ్చిందని, ప్రస్తుతానికి దీనిపై అనుమానాలు లేవని వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధ్రువీకరించలేదు.

    చైనాలో కలకలం సృష్టిస్తున్న హెచ్‌ఎంపీవీ వైరస్ రకం, చిన్నారిలో గుర్తించిన హెచ్ఎంపీవీ వైరస్ రకం ఒకటేనా..? కాదా..? అని తెలియాల్సి ఉంది. చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్‌ (HMPV) వేగంగా విస్తరిస్తుందని, ఇది శ్వాసకోశ వ్యాధులను కలుగజేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడంతో పొరుగున ఉన్న భారత్ భారత్ ఇప్పటికే అప్రమత్తమైంది. ఇటీవలే డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్ఎస్) అధ్యక్షతన జాయింట్‌ మానిటరింగ్‌ గ్రూప్‌ (జేఎంజీ) సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసింది.

    శీతాకాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగానే చైనాలో ఆర్‌ఎస్‌వీ, ఇన్‌ఫ్లూయెంజా, హెచ్‌ఎంపీవీ వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని జేఎంజీ పేర్కొంది. దీని విషయంలో భారత్‌ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు చోట్ల ఆర్‌ఎస్‌ఏ, హెచ్‌ఎంపీవీ పరీక్షలు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక వేళ హెచ్ఎంపీవీ వ్యాప్తి ఒక్కసారిగా విజృంభించినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు జేఎంజీ తెలిపింది.