Jeevan Reddy : తెలంగాణలో త్వరలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ తానిపర్తి జీవన్‌రెడ్డి పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో మరోమారు తాను ఎమ్మెల్సీ బరిలో నిలవాలనుకుంటున్నాడు. గతంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. ఇప్పుడు మరింత సునాయాసంగా గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు. పార్టీలో సీనియర్ నేత కావడంతో పార్టీ మరోసారి అవకాశం కూడా ఇస్తుందన్న దీమాతో ఉన్నారు.
గట్టి పోటీ…
అయితే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి స్వతంత్రులుగా బలమైన అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు. అల్ఫోర్‌స విద్యా సంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి పోటీకి సిద్దమవుతున్నారు. ఆర్థికంగా ఉన్న నేపథ్యంలో పోటీ గట్టిగానే ఇవ్వనున్నారు. ఇక మరో అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ కూడా రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆయన కూడా ప్రంచారం మొదలు పెట్టారు. ఆయనకు కూడా యువతలో గుర్తింపు ఉంది. ఇదే సమయంలో ఆర్థికంగా కూడా ఉన్న వ్యక్తే. ఆయన కూడా గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ఇక జాతీయ పార్టీ బీజేపీ కూడా ఈసారి ఎమ్మెల్సీ స్థానం గెలవాలన్న పట్టుదలతో ఉంది. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆదిలాబాద్, నిజాబాబాద్ ఎంపీలుగా నగేశ్, అర్వింద్ ఉన్నారు. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఈమేరకు బలమైన అభ్యర్థి ఎంపికకు కసరత్తు చేస్తున్నారు.
జీవన్‌రెడ్డికి కష్టమే..
వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి మరోమారు పోటీచేస్తే గెలుపు అంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయనపై సొం పార్టీలోనే వ్యతిరేకత ఉంది. మరోవైపు ఆరేళ్లు పదవిలో ఉన్న ఆయన పెద్దగా చేసిన పనులు ఏమీ లేవు. అధికారంలో లేకపోయినా.. ఎమ్మెల్సీ కోటా నిధులు ఎక్కడా ఖర్చు పెట్టినట్లు గుర్తింపు లేదు. మరోవైపు ప్రభుత్వంపై ఇప్పటికే యువతలో వ్యతిరేకత పెరుగుతోంది. హామీలు అమలు చేయడంలో రేవంత్ సర్కార్ వెనుకబడింది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీచే అవకాశంమే ఉంది. మరోవైపు కాంగ్రెస్ మరోసారి జీవన్‌రెడ్డికి టికెట్ ఇచ్చే అవకావం కూడా తక్కువే అని తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి నిర్ణయానికి అధిష్టానం ఆమోదం తెలుసుతుంది. సీఎంకు జీవన్‌రెడ్డిపై సదాభిప్రాయం లేదు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చేరిక విషయంలో జీవన్‌రెడ్డి సీఎంను కూడా విభేదించారు. ఈ తరుణంలో జీవన్‌రెడ్డిని మళ్లీ ఎమ్మెల్సీగా చేసే అవకాశం తక్కువే.