Telangana hydra : తెలంగాణలో హైడ్రా సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. హైడ్రా అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తోంది. పెద్దపెద్ద భవనాలను నేలమట్టం చేస్తోంది. ఇప్పటికే పదులకొద్దీ ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. ఇందులో అధికార పార్టీ నాయకులను నుంచి మొదలుపెడితే ప్రతిపక్ష నాయకుల వరకు ఉన్నారు. ఫిర్యాదు వస్తే చాలు హైడ్రా రంగంలోకి దిగుతోంది. పెద్ద పెద్ద బుల్డోజర్ లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను పడగొడుతున్నాయి.. నాగార్జున తమ్మిడి కుంట చెరువులో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పడగొట్టిన తర్వాత హైడ్రా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నప్పటికీ.. రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు ఎవరైనా సరే వారి నిర్మాణాలను భూ స్థాపితం చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అధికార పార్టీ నాయకుల ఫామ్ హౌస్ లు పక్కన పెట్టి, ఇతరులకు చెందిన భవనాలను మాత్రమే పడగొడుతున్నారని , వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.. ఈ క్రమంలోనే కొంతమంది యూట్యూబర్లు సరికొత్త వీడియోలను తెరపైకి తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు .. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చెందినదిగా చెబుతున్న ఒక ఫామ్ హౌస్ చరిత్రను బయటికి తీసుకొచ్చారు. హైడ్రా కార్యకలాపాలు మొదలుపెట్టిన తర్వాత అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులకు చెందిన ఫామ్ హౌస్ లను బయటపెడుతుండగా.. ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ నాయకులు చెందిన విలాసవంతమైన భవనాల చరిత్రను ప్రజల ముందు ఉంచుతున్నది. మొత్తానికి పోటాపోటీగా ఎవరికివారు వారి వారి అక్రమాలను ప్రజల ముందు ఉంచుతున్నారు.. అయితే యూట్యూబ్ ఛానల్ వివేక్ వెంకటస్వామి ది గా చెబుతున్న ఫామ్ హౌస్ ను తెరపైకి తీసుకొచ్చింది. ఆ ఫామ్ హౌస్ హిమాయత్ సాగర్ ను ఆనుకుని ఉంది.. అది చూడ్డానికి గోవాలోని ఒక రిసార్ట్ లాగా కనిపిస్తోంది . దశాబ్దల క్రితమే బఫర్ జోన్ ప్రాంతంలో ఈ ఫామ్ హౌస్ నిర్మాణం జరిగిందని ఆ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇది మొత్తం బహుళ అంతస్తుల్లో నిర్మించినట్లు చెబుతున్నారు. కొంతకాలం క్రితం మరో బహుళ అంతస్తుల భవనాన్ని కూడా నిర్మించారు. అది మొత్తం పూర్తిగా ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉంది.. విశాలమైన రహదారుల చివరలో ఈ ఫామ్ హౌస్ ఉంది. అయితే దాని ముందుకు వెళ్తే ఎక్కువసేపు అక్కడ ఉండలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ భారీ స్థాయిలో సెక్యూరిటీ గార్డులు ఉంటారు. వారంతా తరిమికొట్టేందుకు పరిగెత్తుకుంటూ వస్తారని ఆ యూట్యూబ్ నిర్వాహకులు చెబుతున్నారు.. అయితే ఆ వీడియోలో కనిపించినట్టు ఆ ఫామ్ హౌస్ గోవా లోని రిసార్ట్ లాగా దర్శనమిస్తోంది. మరి హైడ్రా దీనిపై చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది వేచి చూడాల్సి ఉంది.
ఇది గోవాలోని రిసార్టు అనుకొంటున్నారా? కాదు మన హైదరాబాదే. హిమాయత్ సాగర్ కు ఆనుకొని ఉన్న ఈ భారీ ఫాంహౌస్ చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ది
ప్రభుత్వానికి దీన్ని కూల్చే దమ్ముందా ?
జర్నలిస్ట్ విజయ రెడ్డి గ్రౌండ్ రిపోర్ట్దశాబ్దాల కిందటనే పూర్తిగా బఫర్ జోన్ లో… pic.twitter.com/WtiswrZSoO
— Mirror TV (@MirrorTvTelugu) August 25, 2024