https://oktelugu.com/

Nag Ashwin: కల్కి పార్ట్ 2లో ప్రభాస్ ని అలా చూపిస్తా… అంచనాలు పెంచేస్తున్న డైరెక్టర్ కామెంట్స్!

ప్రభాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 AD. ఈ చిత్రానికి కొనసాగింపుగా పార్ట్ 2 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా కల్కి సీక్వెల్ ని ఉద్దేశించి దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఉన్నాయి. ఇంతకీ నాగ్ అశ్విన్ ఏమన్నాడో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : August 27, 2024 / 12:58 PM IST

    Nag Ashwin

    Follow us on

    Nag Ashwin: ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ బ్లాక్ బస్టర్ హిట్. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని వంటి స్టార్ కాస్ట్ తో నాగ్ అశ్విన్ అద్భుత ప్రపంచం సృష్టించాడు. పురాణాల ఆధారంగా తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఫలితంగా కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

    Also Read: పెళ్లి ఒకరితో..గర్భం మరొకరితో..పరువు తీసేసిన రామ్ చరణ్ హీరోయిన్!

    ఇప్పుడు అందరి దృష్టి కల్కి 2898 ఏడీ పార్ట్ 2 పై పడింది. కల్కి 2 పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. క్లైమాక్స్ లో డైరెక్టర్ ఇచ్చిన ట్విస్ట్ అయితే పార్ట్ 2 పై క్యూరియాసిటీ పెంచేసింది. సినిమా విడుదలకు ముందు ప్రభాస్ నే కల్కి అని అంతా అభిప్రాయపడ్డారు. కానీ ప్రభాస్ ని కర్ణుడిగా చూపించారు. కల్కి అవతారాన్ని పార్ట్ 2లో నాగ్ అశ్విన్ రివీల్ చేయనున్నారు. అయితే తాజాగా నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ పార్ట్ 2 గురించి మాట్లాడారు.

    ఆయన చేసిన కామెంట్స్ పార్ట్ 2 పై హైప్ పెంచేస్తున్నాయి. ఇటీవల హిందీ నటుడు అర్షద్ వార్సి ప్రభాస్ గురించి అనుచిత కామెంట్స్ చేశాడు. కల్కి మూవీలో ప్రభాస్ జోకర్ లా ఉన్నాడు అంటూ నోరుజారాడు. అర్షద్ వార్సి మాటలు నెట్టింట ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. అర్షద్ వార్సి మాటలు ఖండిస్తూ పలువురు టాలీవుడ్ ప్రముఖులు, హీరోలు ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడిచింది.

    అయితే నాగ్ అశ్విన్ ఈ అంశం పై స్పందించారు. అభిప్రాయాలు ఎవరైనా వ్యక్తం చేయవచ్చు కానీ వ్యక్తం చేసే పద్ధతి ఇది కాదు అని అన్నారు. సౌత్ – నార్త్ అంటూ మళ్లీ వెనక్కి వెళ్లొద్దు. టాలీవుడ్ ఇండస్ట్రీ – బాలీవుడ్ ఇండస్ట్రీ అంటూ విడదీసి మాట్లాడొద్దు. అందరం ఒకటే .. అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో కల్కి 2 ఎప్పుడు ఉంటుంది అనే అంశం ప్రభాస్ ఫ్యాన్స్ తెర పైకి తీసుకొచ్చారు.

    ఈసారి మరింత కష్టపడి పని చేస్తాను .. పార్ట్ 2 లో ప్రభాస్ ని బెస్ట్ గా చూపిస్తాను అని నాగ్ అశ్విన్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ పోస్ట్ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమతి(దీపికా పదుకొనె) కడుపులోని బిడ్డ కోసం యాస్మిన్(కమల్ హాసన్) స్వయంగా రంగంలోకి దిగుతాడు. మరోవైపు అశ్వద్ధామ(అమితాబ్) రక్షణలో ఉన్న సుమతిని భైరవ(ప్రభాస్) అపహరించుకుపోతాడు. సుమతి వేదికగా అశ్వద్ధామ-భైరవ-యాస్మిన్ మధ్య సంఘర్షణ ఎలా ఉంటుంది? అనేది పార్ట్ 2లో ఆసక్తికర అంశం..

    Also Read: 10 నిమిషాల లోపే హౌస్ ఫుల్స్..’గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఊపు మామూలుగా లేదుగా!