https://oktelugu.com/

Telangana BJP: హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ ప్రయోగం ఫలిస్తుందా?

బీజేపీ ఈసారి హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. ఒవైసీని గద్దె దించడమే లక్ష్యంగా కొత్త అభ్యర్థిని ప్రకటించింది. నుదుట రూపాయి బిల్లంత బొట్టు పెట్టుకుని విచిత్ర వేషధారణలో ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న మాధవీలతను ఓవైసీపై బరిలో నిలిపింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 3, 2024 / 01:45 PM IST

    Telangana BJP

    Follow us on

    Telangana BJP: ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ.. అన్నింటికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోవాలని భావిస్తుంది. ఇందులో భాగంగా శనివారం(మార్చి 2న) 195 పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో తెలంగాణకు సంబందించి 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ముగ్గురు సిట్టింగులతోపాటు ఆరుగురు కొత్త, పాత కలయికతో అభ్యర్థులను ఎంపిక చేసింది.

    హైదరాబాద్‌పై ఫోకస్‌..
    బీజేపీ ఈసారి హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. ఒవైసీని గద్దె దించడమే లక్ష్యంగా కొత్త అభ్యర్థిని ప్రకటించింది. నుదుట రూపాయి బిల్లంత బొట్టు పెట్టుకుని విచిత్ర వేషధారణలో ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న మాధవీలతను ఓవైసీపై బరిలో నిలిపింది. విరించి హాస్పిటల్స్‌ ఎండీగా మాధవీలత చాలా మందికి తెలుసు. పాత బస్తీ మూలాలు కలిగి ఉండడం, హిందుత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తుండడం, విచించి హాస్పిటల్స్‌ యజమానిగానే కాకుండా మధు సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ అనే ఐటీ సేవల సంస్థతోపాటు అమెరికాలో క్యూఫండ్‌ అనే ఫిన్‌ కార్ప్‌నూ నడుతపుతున్నారు. ‘లోపాముద్రా ఫౌండేషన్‌’ పేరుతో ఒక స్వచ్ఛందం సంస్థను పాతబస్తీ కేంద్రంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

    గతానికి భిన్నంగా..
    ఇక బీజేపీ గతంలో హైదరాబాద్‌లో గణేశ్‌ ఉత్సవసమితి చైర్మన్‌ లేదా హిందు సంస్థల ప్రతినిధులకు ఎంపీ టికెట్‌ ఇచ్చేది. ఈసారి మాత్రం భిన్నంగా అభ్యర్థిని ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా మోదీ మేనియా కొనసాగుతుండడంతో ఈసారి హైదరాబాద్‌ సీటు గెలవడమే టార్గెట్‌గా అభ్యర్థిని ఆచితూచి ఎంపిక చసినట్లు తెలుస్తోంది.

    గెలుపు లెక్కలు ఇవీ..
    బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎంఐఎం కూడా బలహీనపడినట్లు కనిపిస్తోంది. ఇది బీజేపీకి కలిసి వస్తోందని లెక్కలు వేస్తోంది. అంతేకాకుండా హైదరాబాద్‌ పార్లమెంటు పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ రెండు స్థానంలో నిలిచింది. ఇది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలిస్తుందని భావిస్తోంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌నుంచి అజారుద్దీన్‌ లేదా ఫిరోజ్‌ఖాన్‌ను బరిలో దించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ముస్లిం ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. ఫలితంగా బీజేపీకి లాభం జరుగుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో హైదరాబాద్‌లో త్రిముఖ పోరు తప్పదని భావిస్తున్నారు. అందుకే బలమైన కొత్త ముఖాన్ని బరిలో దించినట్లు తెలుస్తోంది. ఈసారి ఒవైసీపై గెలుపు సాధ్యమే అని అంచనా వేస్తోంది.