HomeతెలంగాణBRS Social Media: బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తోన్న అతిపెద్ద తప్పు అదే..

BRS Social Media: బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తోన్న అతిపెద్ద తప్పు అదే..

BRS Social Media: మరో వారం పది రోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రావడం ఖాయం. బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి అన్నింటికన్నా ముందు ఉంది. కాంగ్రెస్‌ పొత్తులపై కసరత్తు చేస్తోంది. తెలంగాణలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ మాత్రం అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక దశాబ్దం కాలంగా ఎన్నికల్లో సోషల్‌ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. మోదీ ప్రధాని అయిన నాటి నుంచి సోషల్‌ మీడియా ప్రాధాన్యం బాగా పెరిగింది. అందుకే దేశంలో అన్ని పార్టీలకంటే బలంగా బీజేపీ సోషల్‌ మీడియా ఉంటుంది. మొన్నటి వరకు తెలంగాణలో బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా స్ట్రాంగ్‌గా ఉండేది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో నేతలు డీలా పడ్డారు. అదే విధంగా సోషల్‌ మీడియా కూడా దారి తప్పుతోంది. మార్ఫింగ్‌ ఫొటోలతో టీడీపీ నేతలను టార్గెట్‌ చేయడం చూస్తుంటే.. అసలు ఏం జరుగుతోంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా తెలుగు దేశం పార్టీతో గొడవలు పెట్టుకోవడం ద్వారా టైంపాస్‌ చేస్తోంది.

భయపడుతున్న బీఆర్‌ఎస్‌..
మొన్నటి వరకు విపక్షాలకు చుక్కలు చూపించిన బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఇప్పుడు అధికార కాంగ్రెస్‌కు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. ఫేక్‌ న్యూస్‌ పోస్టు చేస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతో ఏది పోస్టు చేయాలో తెలియక బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా మార్ఫింగ్‌ పోస్టులు పెడుతూ అభాసుపాలవుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా టీడీపీ విషయంలో బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా అతిగా స్పందించింది. దీంతో ఆంధ్రా సెటిలర్స్‌ బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఫలితంగా కాంగ్రెస్‌ లాభపడింది.

పనికిరాని విషయాలపై ఫోకస్‌..
సోషల్‌ మీడియా ఇప్పుడు అన్ని పార్టీలకు కీలకంగా మారింది. కానీ, బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా పార్టీకి పనికొచ్చే విషయాలకన్నా, పనికిరాని అంశాలపై ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నట్లు కనిపిస్తోంది. మార్ఫింగ్‌లు వేసుకుంటూ టైంపాస్‌ చేస్తోంది. అధికార పార్టీతో కాకుండా పొరుగు రాష్ట్రం పార్టీలతో గొడవలు పడుతోంది. కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా బలహీనంగా ఉన్నా.. పోస్టు చేసే అంశాలతో బలంగా ముద్ర వేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version