AUS Vs NZ: నాథన్ లయన్ సరికొత్త చరిత్ర.. భారత స్పిన్నర్ రికార్డ్ గల్లంతు

న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో లయన్ ఆరు వికెట్లు తీసి ఆరుదైన ఘనత సాధించాడు.. దీనిద్వారా టీమిండియా ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డు బ్రేక్ చేశాడు.

Written By: Suresh, Updated On : March 3, 2024 2:25 pm

AUS Vs NZ

Follow us on

AUS Vs NZ: రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ పై 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా 1-0 తేడాతో సిరీస్ లో ముందంజ వేసింది. తొలి ఇన్నింగ్స్ లో 174 పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ గ్రీన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకున్నాడు. బ్యాట్ తో గ్రీన్ చెలరేగితే.. బౌలర్ లయన్ న్యూజిలాండ్ జట్టుపై సింహనాదం చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టిన అతడు.. రెండవ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు సాధించి న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. ఇదే క్రమంలో భారత స్పిన్నర్ రికార్డును బద్దలు కొట్టాడు.

న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో లయన్ ఆరు వికెట్లు తీసి ఆరుదైన ఘనత సాధించాడు.. దీనిద్వారా టీమిండియా ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డు బ్రేక్ చేశాడు. అంతేకాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ చరిత్రలో పది సార్లు ఐదు వికెట్లు సాధించిన ఘనత అందుకున్న తొలి బౌలర్ గా ఘనత సృష్టించాడు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండవ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీసి అతడు ఈ ఘనత సాధించాడు. 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నీ మొదలైంది. ఇప్పటివరకు లయన్ పదిసార్లు ఐదు వికెట్లు సాధించిన ఘనతను అందుకున్నాడు. భారత ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 9సార్లు ఈ ఘనత సాధించాడు. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 172 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టును ఓడించింది. రెండు ఇన్నింగ్స్ లో లయన్ 4/43, 6/65 తో అద్భుతమైన ప్రదర్శన చేశాడు.

తొలి టెస్ట్ లో టాస్ ఓడి ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ కు దిగింది. తొలి ఇన్నింగ్స్ లో 383 పరుగులకు ఆల్ అవుట్ అయింది. గ్రీన్ 174 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఒకానొక దశలో 176 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియా జట్టును గ్రీన్ ఆదుకున్నాడు. చివరి వికెట్ కు 100కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మరోవైపు స్పిన్నర్ లయన్ న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీశాడు. రెండవ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్టుపై 172 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించింది.

న్యూజిలాండ్ జట్టు చిత్తుగా ఓడిపోవడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి పడిపోయింది. భారత్ మొదటి స్థానంలోకి వచ్చింది. ఆస్ట్రేలియా రెండవ ర్యాంకులో కొనసాగుతోంది. ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో భారత్ చివరిదైన ఐదో టెస్ట్ ఆడనుంది. ఈ టెస్ట్ లో గెలిస్తే భారత్ తన మొదటి స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుంది.