MP Dharmapuri Arvind Angry: గులాబీ కరపత్రం.. గులాబీ న్యూస్ ఛానల్ మీద నిజాంబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ నిత్యం మండిపడుతూనే ఉంటారు. ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసే సోషల్ మీడియా గ్రూపులపై కూడా ఆయన ఒంటికాలు మీద లేస్తుంటారు. ఏ మాత్రం దాపరికాన్ని ప్రదర్శించకుండా ముక్కుసూటిగానే మాట్లాడుతుంటారు. అవసరమైతే తన స్వరాన్ని మరింత తీవ్రం చేసి.. తన ఆగ్రహాన్ని మరింత ఘాటుగా వ్యక్తం చేస్తుంటారు. ఇక మిగతా మీడియాను ధర్మపురి అరవింద్ పెద్దగా విమర్శించారు. పైగా ఆ సంస్థలో పనిచేసే వ్యక్తులను గౌరవంగానే చూసుకుంటారు. కానీ తొలిసారిగా గులాబీ పార్టీకి సంబంధించిన ఛానల్, పేపర్ ను పక్కనపెట్టి.. ఓ వ్యక్తికి చెందిన పత్రికను తీవ్రస్థాయిలో విమర్శించారు అరవింద్. అంతేకాదు దానికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో తనదైన ఆగ్రహాన్ని ప్రదర్శించారు.
గతంలో గడ్డం వివేక్ బిజెపి లో ఉన్నప్పుడు వి6 వెలుగు కమలం వాయిస్ వినిపించేవి. ఎప్పుడైతే వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడో.. అప్పటినుంచి వి6 వెలుగు స్టాండ్ మారిపోయింది. యజమానికి తగ్గట్టుగానే వార్తలు రాయడం మొదలుపెట్టింది. సరే దీనిని ఎవరూ తప్పు పట్టకపోయినప్పటికీ తప్పుడు వార్తలు రాయడాన్ని మిగతా పార్టీల నాయకులు ఆక్షేపిస్తున్నారు. గతంలో భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా వీ6 వెలుగు రాస్తే.. ఆ పత్రిక, ఛానల్ ను తన పార్టీ కార్యక్రమాలకు రాకుండా నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వి6 వెలుగు అధికారిక పత్రికగా చెలామణి అవుతోంది. ఆ పత్రిక తన యజమాని ప్రయోజనాలకు తగ్గట్టుగా వార్తలు రాసుకుంటే బాగుండేది. కానీ ఎవరిని గెలకకూడదో వారినే గెలికింది. దీంతో ఒకసారి ఆ పత్రిక పరుగు బజారున పడింది.
Also Read: ఈ ఒక్క ఫోటోతో అందరి నోళ్ళూ మూయించిన రేవంత్!
ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఢిల్లీలో ఉన్నారు. పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నారు. పార్లమెంటు సమావేశ సమయంలో సభ్యులు లాబీలు విలేకరులతో సరదాగా మాట్లాడుతుంటారు.. అయితే ఈ విషయాలను కొన్ని మీడియా సంస్థలు ప్రచురిస్తాయి. ఇంకొన్ని మీడియా సంస్థలు ఎందుకని ఊరుకుంటాయి. కానీ వి6 వెలుగు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు మాట్లాడినట్టుగా ఒక సంచలన వార్తను ప్రచురించింది. గులాబీ పార్టీతో పొత్తు విషయంలో పార్టీ హై కమాండ్ దే తుది నిర్ణయం అన్నట్టుగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ప్రకటించినట్టు ఒక వార్తను ప్రచురించింది. వాస్తవానికి భారత రాష్ట్ర సమితి నాయకత్వంపై ధర్మపురి అరవింద్ మొదటి నుంచి కూడా ఆగ్రహపూరితమైన వ్యవహార శైలిని ప్రదర్శిస్తున్నారు. అలాంటప్పుడు తాను ఎలా ఆ పార్టీ విలీనాన్ని స్వాగతిస్తానని ధర్మపురి అరవింద్ అంటున్నారు. పైగా తన పోరాడింది ఆ పార్టీ నాయకులతో అయినప్పుడు.. తను ఎందుకు అలాంటి వైఖరి ప్రదర్శిస్తారని ఆయన చెబుతున్నారు. ఇలాంటి వార్త ప్రచురించిన వి6 వెలుగు ను ఆయన తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా చెడుగుడు ఆడుకున్నారు.. “చెప్పని మాట, తప్పుడు వార్త, చెత్తా చెదారం, గబ్బు వార్తలతో చీకటి విషం చిమ్ముతున్న వెలుగు అని” ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు.. కాదు వెలుగు పత్రిక ప్రచురించిన వార్త పేపర్ కటింగ్ ను తప్పు అని క్రాస్ సింబల్ వేశారు. అయితే ఈ వార్తపై ఇంతవరకు వి6 వెలుగు యాజమాన్యం స్పందించలేదు. ఒకవేళ ధర్మపురి అరవింద్ లీగల్ గా ప్రొసీడ్ అయితే.. యాజమాన్యం స్పందిస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..