https://oktelugu.com/

Praja Bhavan: కేసీఆర్ ‘ప్రగతిభవన్’ను డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా ఎందుకు చేశారు? ఏంటా మర్మం!

వారం తిరిగింది.. ప్రజాభవన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాభవన్‌ను ఇకపై ప్రజల కోసమే వినియోగిస్తారని అంతా భావించారు.

Written By: , Updated On : December 15, 2023 / 01:08 PM IST
Praja Bhavan

Praja Bhavan

Follow us on

Praja Bhavan: తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి వారం క్రితం ప్రమాణం చేశారు. అదే రోజు ప్రగతి భవన్‌ కంచెను బద్ధలు కొట్టించారు. ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణం చేసిన తర్వాత ప్రగతి భవన్‌ పేరును ప్రజాభవన్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై అందరికీ ఇందులోకి అనుమతి ఉంటుందని తెలిపారు. ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని ప్రకటించారు. చెప్పినట్లుగానే డిసెంబర్‌ 8న ప్రజాదర్బాద్‌ నిర్వహించారు. సీఎం రేవంత్‌ స్వయంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

డిప్యూటీ సీఎంకు కేటాయింపు..
వారం తిరిగింది.. ప్రజాభవన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాభవన్‌ను ఇకపై ప్రజల కోసమే వినియోగిస్తారని అంతా భావించారు. కానీ, డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా ప్రకటించారు. దీంతో అంతా అవాక్కయ్యారు. కొందరైతే సీఎం రేవంత్‌పై విమర్శలు మొదలు పెట్టారు. ప్రజాభవన్‌ అని చెప్పి భట్టికి ఎలా కేటాయిస్తారు? అని ప్రశ్నిస్తున్నారు.

నాలుగు భవనాలు..
అయితే.. సీఎంను విమర్శిస్తున్నవారు.. భట్టికి కేటాయించడాన్ని తప్పు పడుతున్నవారు మర్చిపోతున్న విషయం ఏమంటే.. ప్రజాభవన్‌ పేరుతో ఉన్న ప్రాంగణంలో మొత్తం నాలుగు భవనాలు ఉన్నాయన్నది. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివసించిన భవనంతోపాటు.. మరో నాలుగు ఉన్నాయి. వీటిల్లో ఒకదాన్ని ఇప్పటికే ప్రజావాణి కోసం వినియోగిస్తున్నారు. మరో భవనాన్ని తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు (ఇందులోనే ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ నివాసం ఉండేవారు) కేటాయించారు. మిగిలిన మూడు భవనాల్లో ఒక భవనాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా.. రెండో దాన్ని ఎవరికైనా మంత్రికి కానీ.. లేదంటే రాష్ట్రానికి వచ్చే అతిధులకు వినియోగించుకోవటానికి కేటాయించనున్నారు. ఇందులోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ నివాసం ఉండేవారు. మూడో భవనంలో ఎస్సీ.. ఎస్టీ బీసీ విద్యార్థులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు.

వనరుల సద్వినియోగం..
ప్రజాభవన్‌లోని ఐదు భవనాలు.. ఐదుగురికి కేటయించటం చూస్తే.. ఉన్న వనరుల్ని పూర్తిగా వినియోగించే తీరును సీఎం రేవంత్‌ ప్రదర్శించారని చెప్పాలి. అంతేకాదు.. ఈ మొత్తం భవనాల సముదాయాన్ని గతంలో ముఖ్యమంత్రి నివాసంగా ఉండేది. ఇప్పుడు అర్థమైందా? రేవంత్‌ తీసుకున్న నిర్ణయంలోని అసలు మర్మం. ప్రజావాణికి ఎలాంటి ఆటకం ఉండదు. పైగా పక్కనే డిప్యూటీ సీఎం ఇళ్లు ఉండడంతో ప్రజావాణికి వచ్చే అర్జీలు త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది.