Sharmila – Congress : తెలంగాణలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలన తెస్తానని బయల్దేరింది.. ఆయన కూతురు షర్మిల. ఇందు కోసం వైఎస్సార్ తెలంగాణ పార్టీని కూడా పెట్టింది. సుమారు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేసింది. విపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు చేయని విధంగా ప్రభుత్వాన్ని డైరెక్ట్‌గా టార్గెట్ చేసింది. సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. అరెస్టు అయినా.. దాడులు జరిగినా వెరవలేదు. కానీ ఎన్ని చేసినా తెలంగాణలో పార్టీని పట్టించుకునేవారు కరువయ్యారు. షర్మిలను ఆంధ్రాకు చెందిన మహిళగానే చూస్తున్నారు. తెలంగాణ కోడలిగా ఓన్ చేసుకోవడం లేదు. ఈ తరుణంలో పార్టీ కార్యకలాపాలు తగ్గించారు షర్మిల. కర్ణాటక ఎన్నికల ఫలితర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో కర్ణాకట ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌ను కర్ణాటక వెళ్లి కలిశారు. దీంతో షర్మిల కాంగ్రెస్‌లో చేరడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని షర్మిల ఖండించినప్పటికీ, రాజకీయవర్గాలు సందడి చేస్తూనే ఉన్నాయి, అయితే గత కొద్ది రోజులుగా ఈ అంశం మసకబారుతోంది. కారణం.. కాంగ్రెస్‌లో చేరికను ఇద్దరు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ ఇద్దరు ఎవరు…
షర్మిల చేరికను అడ్డుకుంటున్నది ఎవరు అన్న చర్చ కాంగ్రెస్‌లో జరుగుతోంది. మెజారిటీ నేతలు వైఎస్సార్ తనయ రాకను స్వాగతిస్తున్నారు. అయితే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి షర్మిల కాంగ్రెస్‌లో చేరికను అడ్డుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే రేవంత్ సన్నిహితులు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. కానీ రేవంత్‌తోపాటు, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు షర్మిల కాంగ్రెస్‌లో చేరకుండా అడ్డుకుంటున్నారని తెలుస్తోంది.
తెలంగాణ వ్యతిరేకి అని..
కాంగ్రెస్ స్ట్రాటజిస్టు సునీల్ కనుగోలు జూన్ 28న న్యూఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్‌తో సమావేశమై షర్మిల చేరికపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా షర్మిల ప్రచారం చేసినందున ఆమె కాంగ్రెస్‌లోకి రావడం ప్రతికూల ప్రభావం చూపుతుందని సునీల్ హైకమాండ్‌కు తెలియజేశారు. 2018 ఎన్నికల్లో తెలుగుదేశంతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నారని ఓట్లు వేయలేదని, ఇప్పుడు షర్మిల చేరితే రాబోయే ఎన్నికల్లో కూడా పరిస్థితులు పునరావృతం కావొచ్చని ఉదహరించారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ షర్మిల చేరికను స్వాగతిస్తున్నా.. సేవలు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఉపయోగించుకుంటామని తెలియజేసింది. అయితే, షర్మిల కాంగ్రెస్ ప్రతిపాదనకు అంగీకరించలేదని సమాచారం. తన ఆసక్తి తెలంగాణపై ఉందని, ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారని తెలిసింది.