అసద్ అభివృద్ధి ఏది?

అండ వుంటే కొండ బద్దలు కొట్టవచ్చు అని నిరుపిస్తున్నారు గ్రేటర్ ఓటర్లు. ఓటు అనే ఆయుధంతో నాయకులను ప్రశ్నిస్తున్నరు. ఒకప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. ప్రజలు కూడా చాలా చైతన్యవంతులయ్యారు. రాజకీయ నాయకుల ప్రచారానికి వస్తే అభివృద్ధి పనులు సరిగా చేశారా అని ప్రశ్నిస్తున్నారు. Also Read: బీజేపీ ఆకర్ష్‌ కు కాంగ్రెస్ ఖాళీయేనా? మజ్లిస్ అడ్డాలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఎంత పట్టు ఉంటుందో అందిరికి తెలిసిన విషయమే. పాతబస్తీలోని […]

Written By: NARESH, Updated On : November 23, 2020 5:10 pm
Follow us on

అండ వుంటే కొండ బద్దలు కొట్టవచ్చు అని నిరుపిస్తున్నారు గ్రేటర్ ఓటర్లు. ఓటు అనే ఆయుధంతో నాయకులను ప్రశ్నిస్తున్నరు. ఒకప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. ప్రజలు కూడా చాలా చైతన్యవంతులయ్యారు. రాజకీయ నాయకుల ప్రచారానికి వస్తే అభివృద్ధి పనులు సరిగా చేశారా అని ప్రశ్నిస్తున్నారు.

Also Read: బీజేపీ ఆకర్ష్‌ కు కాంగ్రెస్ ఖాళీయేనా?

మజ్లిస్ అడ్డాలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఎంత పట్టు ఉంటుందో అందిరికి తెలిసిన విషయమే. పాతబస్తీలోని చాలా ప్రాంతాల్లో అసద్ వస్తే పండగలా ఉంటుంది అక్కడి వాతవారణం. అసద్ పై వ్యతిరేకత లేదా అంటే.. ఉంటుంది కానీ మరీ అంత ఎక్కువగా ఉండదు. ఎన్నికల వేళ.. అసద్ ప్రచారం భిన్నంగా సాగుతుంటుంది. మీడియాకు పెద్దగా సమాచారం ఇవ్వరు. గుట్టుగా తన వంతు ప్రచారం చేసుకుంటూ పోతారు.

Also Read: కాంగ్రెస్ కు షాక్.. గ్రేటర్ లో బీజేపీ తరుఫున విజయశాంతి ప్రచారం

ఇప్పటివరకు ఆయనకు ఎదురన్నదే లేనట్లుగా సాగే తీరుకు భిన్నంగా తాజాగా ఒక పరిణామం చోటు చేసుకుంది. మజ్లిస్ కు పట్టు ఉన్న జాంబాగ్ డివిజన్ లో ఈ రోజు అసద్ ఎన్నికల ప్రచా రాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా అక్కడున్న ప్రజల నుంచి ఆయనకు అనుకోని అనుభవం ఎదురైంది. కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదని.. ఎన్నికల వేళ ఎలా ఓట్లు అడు గుతారని స్థానిక ప్రజలు ప్రశ్నించారు.
ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల ప్రచారానికి మాత్రం వస్తున్నారని.. తాము కష్టకాలంలో ఉన్న ప్పుడు పట్టించుకోకుండా ఓట్లు అడగటానికి వస్తున్నారా? అని ప్రశ్నించారు. ఓట్లు అడగటానికి వస్తున్న వారు.. ఎన్నికల్లో గెలిచిన వెంటనే మొహం చాటేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రశ్నల వర్షాన్నిఊహించని అసద్ కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. దీంతో.. ఆయన మాట్లాడకుండా వెళ్లిపోయారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

నగరంలో పలుచోట్ల ఇలాంటి దృశ్యాలు కనపడుతున్నాయి. ఎమ్మెల్యేలకు, అభ్యర్థులకు, నాయ కులకు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా రోడ్డేస్తేనే ఓటు అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును యప్రాల్ వాసులు అడ్డుకున్నారు. ‘నో రోడ్ – నో వోట్’, ‘రోడ్డు వేయండి – ఓటు అడగండి’ నినాదాలతో ప్లకార్డులు పట్టి నిరసనకు దిగారు. అంతేగాక రెండు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. స్థానికుల నిరసనతో ఎన్నికలు అవ్వగానే రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు.  ప్రజలు ఇలా నిరసనలు చేయడంతో ప్రచారం ఎలా చేయాలని నాయకులు తలలు పట్టుకుంటున్నరు.