Tandel movie : సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేయడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన సమయంలో రిలీజ్ చేయడం కూడా అంతే ముఖ్యం సరైన సమయాల్లో రిలీజ్ అవ్వకపోవడం వల్ల ప్లాప్ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగ అనేది చాలా పెద్ద పండుగ గా మనం చెప్పుకోవచ్చు. ఈ సీజన్ కి చాలా మంది పెద్ద హీరోలు వాళ్ళ సినిమాలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉంటారు. నిజానికైతే ఇప్పటికే సంక్రాంతి బరిలో రామ్ చరణ్ బాలకృష్ణ లాంటి భారీ హీరోలు నిలిచిన క్రమంలో ఇప్పుడు నాగచైతన్య కూడా తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే నెట్ ప్లిక్స్ తో వీళ్లు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వీళ్లు కనక సంక్రాంతి కానుక గా థియేటర్ లోకి వస్తే నెట్ ఫ్లిక్స్ రేట్స్ భారీగా తగ్గిపోయే అవకాశాలైతే ఉన్నాయి. ఒకవేళ డిసెంబర్లో కనక ఈ సినిమాని రిలీజ్ చేస్తే భారీ మొత్తంలో ఈ సినిమా రైట్స్ ని తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయితే ఎందుకు డబ్బులను తగ్గిస్తున్నారు అంటే సంక్రాంతికి సినిమా రిలీజ్ అయితే చాలామంది థియేటర్ లోనే ఈ సినిమాలను చూస్తారు.
కాబట్టి మళ్ళీ వాళ్ళు ఓటిటిలో ఈ సినిమా చూడడానికి ఇష్టపడరు. అందువల్లే పండగ సీజన్ క్యాష్ చేసుకోవాలంటే ఓటిటి రైట్స్ అనేవి భారీగా తగ్గిపోతాయి. డిసెంబర్ లో కనక రిలీజైతే మాత్రం నాగచైతన్యకి భారీగా ఓటిటి రైట్స్ రూపంలో డబ్బులు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక తొందర్లోనే ఈ విషయం మీద అల్లు అరవింద్ ఒక నిర్ణయానికి రాబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా నాగచైతన్య ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఆయన కెరియర్ అనేది భారీగా డౌట్ ఫాలో అయ్యే అవకాశాలున్నాయి.
మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించాలంటే మాత్రం ఈ సినిమా ఏదో ఒక మ్యాజిక్ క్రియేట్ చేయాల్సిన అవసరమైతే ఉంది. మరి ఈ సినిమా డిసెంబర్ ఎండింగ్ లో వస్తుందా లేదంటే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారా అనే విషయం మీద క్లారిటీ వస్తే గాని ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్ రాబడుతుంది అనేది మనం క్లారిటీగా చెప్పలేము…