YS Sharmila : గత పదిరోజుల నుంచి షర్మిల బెంగళూరులో మకాం వేశారు. డీకే శివకుమార్‌ను పలుమార్లు కలిశారు. తన వైఎస్సార్ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. కేసీ వేణుగోపాల్‌తో పలుమార్లు చర్చలు జరిపారు. ఆమె త్వరలో ఏపీ రాజకీయాల్లోకి వెళ్తారు. కాంగ్రెస్‌తో చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇవీ నిన్నా మొన్నటి వరకూ తెలంగాణ రాజకీయా వర్గాల్లో జరిగిన చర్చలు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఏంటంటే విలీనం మాత్రమే కాదని అంతకుమించిన ప్రయోజనాలు షర్మిలకు దక్కుతున్నాయని తెలుస్తోంది.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలించిందీ అంటే దానికి కారణం డీకే శివకుమార్. ఒకానొకదశలో శివకుమార్‌నే ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం భావించింది. చివరికి సిద్ధరామయ్యను అదృష్టం వరించింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయినప్పటికీ దాదాపు డీకే కేంద్రంగానే కర్ణాటకలో పాలన నడుస్తోంది. కర్ణాటక దక్షిణాది రాష్ట్రం కావడం, అక్కడ గెలుపొందిన నేపథ్యంలో ఆ ప్రభావం తెలంగాణ మీద కూడా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ బాధ్యులు చెబుతున్నారు. అందులో భాగంగానే డీకే శివకుమార్‌కు తెలంగాణ ఎన్నికల ప్రచారం బాధ్యతలు అప్పగిస్తారనే టాక్ నడుస్తోంది. అయితే దానిని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఇప్పటికే ఆ దిశగా మంతనాలు సాగుతున్నాయి. డీకే శివకుమార్‌ను పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి వారు కలవడం పై వాదనలకు బలం చేకూర్చుతోంది. అయితే ఇదే డీకే శివకుమార్‌ను షర్మిల ఇటీవల బెంగళూరులో మకాం వేసి శివకుమార్‌తో పలు మార్లు చర్చలు జరిపింది.
ఆ చర్చలు ఫలప్రదమయ్యానే సంకేతాలు కనిపిస్తున్నాయి. షర్మిల కూడా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేశారు. ఎయిర్ పోర్ట్‌లో మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు సంధించినప్పటికీ ఆమె మౌనమే సమాధానంగా చెప్పి వెళ్లిపోయారు. అయితే షర్మిల పార్టీ విలీనంతో కాదని, ఆమెకు అంతకుమించిన ప్రయోజనాలు దక్కుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఏపీలో బాధ్యతలు అప్పగిస్తారా అనే దానిపై క్లారిటీ లేకపోయినప్పటికీ.. సికింద్రాబాద్ లేదా పాలేరు నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఈ నియోజకవర్గాల్లో ఆమె కనుక పోటీ చేస్తే తెలంగాణ రాజకీయాల్లోనే ఆమె ఉండిపోయే అవకాశం ఉంది. ఆమె పొడను గిట్టని రేవంత్‌రెడ్డి దీని మీద ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే డీకే శివకుమార్ ఈ ప్రతిపాదనను వేణుగోపాల్ ముందు ఉంచారని టాక్ నడుస్తోంది.