https://oktelugu.com/

దుబ్బాక ఫలితం: హరీశ్ రావు భవితవ్యం పై తీవ్ర చర్చ..

దుబ్బాకలో మొత్తానికి బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పై సానుభూతి, ఆ పార్టీ నాయకుల దూకుడు స్వభావంతో కమలంపై నమ్మకం కలిగేలా చేశాయి. దుబ్బాకలో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి బీజేపీ కూడా ఈ స్థానంలో గెలుస్తానని అనుకోలేదు. అనుహ్యంగా వచ్చిన మార్పులతో ఇక్కడి ప్రజలు బీజేపీకే పట్టం కట్టడంతో సంబరాలు చేసుకుంటున్నారు. Also Read: టీఆర్‌‌ఎస్‌ను దెబ్బతీసిన సోషల్‌ మీడియా దుబ్బాక ఫలితంలో రెండో స్థానంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇక్కడి ఉప ఎన్నికను […]

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2020 / 06:56 AM IST
    Follow us on

    దుబ్బాకలో మొత్తానికి బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పై సానుభూతి, ఆ పార్టీ నాయకుల దూకుడు స్వభావంతో కమలంపై నమ్మకం కలిగేలా చేశాయి. దుబ్బాకలో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి బీజేపీ కూడా ఈ స్థానంలో గెలుస్తానని అనుకోలేదు. అనుహ్యంగా వచ్చిన మార్పులతో ఇక్కడి ప్రజలు బీజేపీకే పట్టం కట్టడంతో సంబరాలు చేసుకుంటున్నారు.

    Also Read: టీఆర్‌‌ఎస్‌ను దెబ్బతీసిన సోషల్‌ మీడియా

    దుబ్బాక ఫలితంలో రెండో స్థానంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇక్కడి ఉప ఎన్నికను మొదట్లో లైట్ గా తీసుకుంది. ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్ దే గెలుపని ఆ పార్టీ నాయకులు చెప్పుకొచ్చారు. దీంతో ఇక్కడి టీఆర్ఎస్ గెలపు బాధ్యతను మంత్రి హరీశ్ రావు తన భుజాలపై వేసుకున్నాడు. దుబ్బాకను అభివ్రవుద్ధి చేసే బాధ్యత నాదే అంటూ మొదటి నుంచి ప్రచారం చేయసాగాడు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సైతం సిద్ధిపేట జిల్లాలో ఏ ఎన్నిక జరిగినా హరీశ్ రావుకే అప్పగిస్తున్నారు.

    Also Read: టీఆర్‌‌ఎస్‌ వల్లే బీజేపీ గెలిచిందా..!

    మంగళవారం వెలువడిన ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ నిచ్చాయి. అనుకున్నదాని కంటే దారుణంగా ఓడిపోయింది. ఓట్ల లెక్కింపు సమయంలో మొదటి రౌండ్ నుంచి బీజేపీకే ఆధిక్యం రావడంతో టీఆర్ఎస్ పార్టీపై ప్రజలకున్న విశ్వాసం కనబడింది. అయితే 6,7,10 రౌండ్ కు వచ్చేసరికి టీఆర్ఎస్ కు ఆధిక్యం వచ్చాయి. 20 వ రౌండ్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. దీంతో కారు పార్టీ గెలుపు ఖాయమేననుకున్నారు. కానీ తీవ్ర ఉత్కంఠ మధ్య పోటా పోటీ జరిగి చివరికి బీజేపీ గెలుపొందింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    దుబ్బాక నియోజకవర్గ అభివ్రద్ధి బాధ్యత నాదే అంటూ చెప్పొకొచ్చిన హరీశ్ రావు లెక్కింపు పూర్తయిన తరువాత ఓటమికి నాదే బాధ్యత అని చెప్పారు. అయితే కేసీఆర్ ముందే ఊహించి ఇక్కడ హరీశ్ రావుకు బాధ్యత అప్పగించాడా..? అనే అనుమానాలు సాగుతున్నాయి. దుబ్బాకలో ప్రచారానికి హరీశ్ రావు, కవిత, కొందరు ఎంపీలు, మంత్రులు ప్రచారం చేశారు. కానీ కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ ప్రచారం చేయలేదు. పైగా బయటి నుంచి వారు బీజేపీని రెచ్చగొట్టారు. ఇదంతా చూస్తుంటే హరీశ్ రావుకు చెక్ పెట్టేందుకే కేసీఆర్ ఈ పథకం వేశాడా..? అని చర్చించుకుంటున్నారు. దీంతో రాను రాను హరీశ్ రావు భవితవ్యం ఏంటోనని అందరూ తీవ్రంగా చర్చించుకుంటున్నారు.