https://oktelugu.com/

మీ బ్లడ్ గ్రూపు ఇది అయితే మీ ప్రాణాలు పోయినట్టే..

మనిషి రక్త గ్రూపులు ఎన్ని రకాలంటే..  ఏ, బీ, ఏబీ, ఓ బ్లడ్ గ్రూపులను ఠక్కున చెప్పేస్తారు. కానీ దీనికి తోడు చాలా అరుదైన బ్లడ్ గ్రూపులు ప్రపంచంలో ఉన్నాయని మీకు తెలుసా.? కేవలం ప్రపంచవ్యాప్తంగా 40మంది దగ్గర మాత్రమే ఈ కొన్ని అరుదైన రక్త గ్రూపులున్నాయి. ఈ గ్రూపు పేరు రీసస్ నెగెటివ్ (RH Null). దీన్నే గోల్డెన్ బ్లడ్ గ్రూప్ గా పిలుస్తారు. అసలు రక్త గ్రూపులు ఎలా ఏర్పడుతాయో తెలుసా.? ఎవరి శరీరంలోనైనా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2020 / 06:43 AM IST
    Follow us on

    మనిషి రక్త గ్రూపులు ఎన్ని రకాలంటే..  ఏ, బీ, ఏబీ, ఓ బ్లడ్ గ్రూపులను ఠక్కున చెప్పేస్తారు. కానీ దీనికి తోడు చాలా అరుదైన బ్లడ్ గ్రూపులు ప్రపంచంలో ఉన్నాయని మీకు తెలుసా.? కేవలం ప్రపంచవ్యాప్తంగా 40మంది దగ్గర మాత్రమే ఈ కొన్ని అరుదైన రక్త గ్రూపులున్నాయి. ఈ గ్రూపు పేరు రీసస్ నెగెటివ్ (RH Null). దీన్నే గోల్డెన్ బ్లడ్ గ్రూప్ గా పిలుస్తారు.

    అసలు రక్త గ్రూపులు ఎలా ఏర్పడుతాయో తెలుసా.? ఎవరి శరీరంలోనైనా యాంటిజెన్ తక్కువ మోతాదులో ఉంటే వారి బ్లడ్ గ్రూప్ ను అత్యంత అరుదైన గ్రూపుగా పరిగణిస్తారు. యాంటీజెన్ అనేది శరీరంలోని యాంటీబాడీలో తయారవుతుంది. అది శరీరాన్ని వైరస్, బ్యాక్టీరియా ల నుంచి కాపాడుతుంది.

    ఎవరికైతే రీసస్ నెగెటివ్ బ్లడ్ గ్రూపు ఉంటుందో వారు తమ రక్తాన్ని దానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడగలరు. గడిచిన 52 సంవత్సరాల్లో కేవలం 43 మంది దగ్గర మాత్రమే ఇటువంటి బ్లడ్ గ్రూప్ ఉన్నట్టు వెల్లడైంది. రీసస్ నెగెటివ్ బ్లడ్ కలిగిన వారు ప్రపంచంలో ఎవరికైనా సరే రక్తదానం చేయగలుగుతారు..

    ఈ అరుదైన బ్లడ్ గ్రూపు కలిగిన వారు సాధారణ మనుషుల్లానే ఉంటారు. అయితే వీరు తమపై తాము మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరికి బ్లడ్ గ్రూప్ డోనర్ దొరకడం కష్టం.. ఏదైనా ప్రమాదమై రక్తం అవసరం పడితే చావడమే.. తక్కువమంది ఈ గ్రూపు వారు ఉండడంతో వారికోసం వెయిట్ చేసే వరకూ ప్రాణాలే పోతాయి.