https://oktelugu.com/

Cheque : ఇలాంటి చెక్కులతో డబ్బులు డ్రా చేసుకోలేం.. కారణం తెలుసా?

చెక్‌.. బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకునే పత్రం. ప్రస్తుతం యూపీఐల కాలం నడుస్తోంది. అయినా చెక్కులకు డిమాండ్‌ తగ్గలేదు. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా.. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఈఎంఐ కట్టాలన్నా, వాహనాలు, విలువైన వస్తువులు కొనాలన్నా చెక్కులు చాలా ముఖ్యం.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 26, 2024 / 12:08 PM IST

    Cross Cheque

    Follow us on

    Cheque :  ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకులు ఖాతాదారులకు అకౌంట్‌తోపాటు చెక్కు బుక్కు, ఏటీఎం కార్డులు కూడా ఇస్తాయి. ఏటీఎం, చెక్‌బుక్‌ నగదు డ్రాకోసం వినియోగిస్తారు. ఇతరులకు డబ్బులు ఇవ్వడానికి కూడా చెక్కులు రాసిస్తారు. ఈఎంఐ చెల్లింపులు కూడా చెక్కుల ద్వారా జరుగుతుంది. అందుకే చెక్కులకు చాలా ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం యూపీఐల ద్వారా చెల్లింపులు చేస్తున్నా… చెక్కుల ప్రాధాన్యం ఎక్కడా తగ్గలేదు. అయితే కొందరు చెక్కులను అసలే ఉపయోగించరు. చాలా మందికి చెక్కుల రకాల గురించి కూడా తెలియదు. అలాంటి వాటులో ఒకటి క్రాస్‌ చెక్‌. చెక్కుపై ఎడమవైపు మూలలో రెండు గీతలు గీస్తారు. ఈ గీతలు ఎందుకు గీస్తారు.. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్‌ 1881 ప్రకారం. క్రాస్‌ చేసిన చెక్కుల నుంచి నగదు ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.

    నగదుగా మార్చుకోలేం..
    నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ 1881 ప్రకారం.. చెక్కులపై రెండు గీతలు క్రాస్‌ చేసి ఇస్తారు. ఇలాంటి చెక్కులను బ్యాంకులో ఇస్తే నగదు ఇవ్వరు. మూలన క్రాస్‌ చేసిన కారణంగా ఇలా చేస్తారు. చెక్‌పై క్రాస్‌ చేయడం వలన డబ్బు విత్‌డ్రా కాకుండా చెక్‌ పొందిన వ్యక్తి లేదా సూచించిన వ్యక్తులు బ్యాంకు ఖాతాలో చెక్కు ద్వారా నగదు జమ చేస్తారు.

    క్రాస్‌ చెక్‌ రకాలు..!
    క్రాస్‌ చెక్‌లో అనేక రకాలు ఉన్నాయి. మొదటిది సాధారణ క్రాసింగ్‌. ఇప్పటి వరకు చెప్పుకున్నట్లుగా చెక్‌పై మూలన రెండు గీతలు గీయడం. ఇక రెండోది ప్రత్యేక క్రాసింగ్‌. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ 1881 లోని సెక్షన్‌ 124 పకారం.. చెక్‌ గ్రహీత నిర్ధిష్ట బ్యాంకు ఖాతాలోకి వెళ్లాలని డ్రాయర్‌ కోరుకున్నప్పుడు ప్రత్యేక క్రాసింగ్‌ చెక్‌ జారీచేస్తారు. ఉదాహరణకు గ్రహీత ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటే.. చెక్కు దిగువన ఉన్న పంక్తుల మధ్య దానిపేరు రాయడం ద్వారా డ్రాయర్‌ బ్యాంకునుఉ పేర్కొనవచ్చు. ఇక చెక్‌పై క్రాసింగ్‌ లైన్‌ మధ్యలో అకౌంట్‌ పే అని రాస్తే గ్రహీత మాత్రమే దాని నుంచి డబ్బును విత్‌డ్రా చేయగలరు. అయితే ప్రత్యేక క్రాసింగ్‌తో నిర్ధిష్ట బ్యాంకును పేర్కొంటే ఆ బ్యాంకులో మాత్రమే డబ్బులు ఇస్తారు. ఇది నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ 1881లో స్పష్టంగా ఉంది.

    ఎందుకు జారీ చేస్తారంటే..!
    క్రాస్ట్‌ చెక్‌లను ఎందుకు జారీ చేస్తారంటే.. గ్రహీత ఆ మొత్తాన్ని అందుకున్నారని నిర్ధారించుకోవడానికే. ఆ చెక్కు తప్పుడు చేతుల్లోకి వెళ్లినా, అందులో డబ్బులు తీసుకోలేరు. దీంతో దుర్వినియోగం జరగకుండా భద్రత కల్పించబడుతుంది.