https://oktelugu.com/

Buy a House in Hyderabad: హైదరాబాద్‌లో ఇల్లు కొనాలనుకుంటున్నారా.. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి..

దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటోంది. రియల్ వ్యాపారం ఇప్పుడు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతోంది. అయితే.. మనీ రొటేషన్‌లో భాగంగా ఆయా సంస్థలు అమ్మకాలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 22, 2024 3:47 pm
    Buy a House in Hyderabad:

    Buy a House in Hyderabad:

    Follow us on

    Buy a House in Hyderabad: దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటోంది. రియల్ వ్యాపారం ఇప్పుడు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతోంది. అయితే.. మనీ రొటేషన్‌లో భాగంగా ఆయా సంస్థలు అమ్మకాలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో చాలా వరకు కంపెనీలు ఎన్నో రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. డిస్కౌంట్లు కూడా ఇస్తున్నాయి. ఎలాగైనా తమ వ్యాపారాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వివిధ రకాల టాస్క్‌లకు దిగుతున్నాయి.

    దేశవ్యాప్తంగా రియల్ సంస్థలు ఇదే ధోరణితో ముందుకు సాగుతుండగా.. హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంటున్నది. చాలా నగరాలను దాటుకొని రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్‌లో టాప్ ప్లేసులో నిలిచింది. ఇప్పుడిప్పుడే ఇక్కడ బిజినెస్ పెరుగుతోంది. ఎంక్వయిరీలూ పెరుగుతున్నాయి. అయితే.. వాటిని చివరి కొనుగోలు వరకూ వెళ్లేలా కొత్త కొత్త ఆఫర్లు ఆఫర్ చేస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాలు ఆఫర్లు ఇస్తూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఆ నివేదిక ప్రకారం దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ టాప్ ప్లేసులో నిలిచింది. హైదరాబాద్ తరువాతే బెంగళూరు నగరం సెకండ్ ప్లేసులో ఉంది. ఆ తర్వాతి స్థానంలో ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై నగరాలు నిలిచాయి. దాంతో తమ వ్యాపారాన్ని మరింత పెంచుకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

    అపార్టుమెంట్లు నిర్మిస్తున్న బడా సంస్థల ఎగ్జిక్యూటీవ్‌లు ముందస్తు బుకింగ్ కన్నా కాస్త తగ్గించేందుకు కొత్త కొనుగోలు దారులకు ఆఫర్ ప్రకటిస్తున్నాయి. బుకింగ్ కన్నా కాస్త తగ్గించేందుకు కొత్త కొనుగోలుదారులకు అవకాశం ఇస్తున్నట్లుగా సోషల్ మీడియాలో చెబుతున్నాయి. ఇల్లు కొనుగోలు చేయాలంటే ఇదే సరైన సమయం అని, ఆఫర్లు పొందడానికి కూడా ఇదే మంచి సమయం అని కూడా అంటున్నారు. అయితే.. ఆరు నెలల క్రితం ధరలతో పోలిస్తే ఇప్పుడు కూడా ధరలు పెద్దగా పెరగలేదు. కానీ.. అప్పటి ధర మీద ఆఫర్లు ఇచ్చేందుకు మాత్రం కొన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. బడా సంస్థలే కాకుండా.. చిన్నచిన్న రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ధరలు తగ్గించి విక్రయిస్తున్నారు. బిల్డర్లు సైతం ధరలను తగ్గించుకొని విక్రయించేందుకు రెడీ అంటున్నారు. అయితే.. దీనికీ పలు కారణాలు ఉన్నాయి. ఇంతవరకు పెట్టిన పెట్టుబడికి వడ్డీలు పెరిగిపోవడం.. మనీ రొటేషన్ కాకపోవడంతో రియల్ సంస్థలు ఈ వ్యాపారానికి తెరలేపినట్లుగా తెలుస్తోంది. అందుకే చాలా మంది ఎక్కువ లాభాలకు పోకుండా.. అంతోఇంతో తగ్గించుకొని విక్రయించే పనిలో పడ్డాయి. అందుకే.. ఇంటి కొనుగోలు కూడా ఇంతకంటే మంచి సమయం ఉండదని, భూమ్ ఊపందుకున్న తర్వాత ఇప్పుడు ఇస్తున్న డిస్కౌంట్లు అప్పుడు దక్కకపోవచ్చన్న ప్రచారం వినిపిస్తోంది. ఇప్పుడు ప్రకటించిన ఆఫర్లను కూడా కవర్ చేసుకునేలా రేట్లు పెంచుతారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇల్లు కొనుగోలుకు ఇదే బెస్ట్ టైం అని కూడా సలహాలు ఇస్తున్నారు.