దేశ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన.. ఎటుచూసినా శవాల ‘గుట్టలు’. క్షతగాత్రుల హాహాకారాలు.. తల్లుల గుండెకోత.. తండ్రుల గుండెల నిండా బాధ.. బిడ్డల మానసిక క్షోభ.. కొడుకుల గోస.. మాటలకందని మహావిషాదం. ఏ అక్షరానికీ అందని అంతులేని శోకం.. కొండల నడుమ సూరీడు ఉదయించిన వేళ అంజన్న పాదాల చెంత అస్తమించిన అభాగ్యులు.. నిత్యం మారుతి నామస్మరణతో మారుమోగ కొండగట్టు మార్గంలో చావు కేకలు.. 100 మంది ప్రయాణికులతో జగిత్యాల జిల్లా శనివారం పేట నుంచి బయల్దేరిన ఆర్టీసీ బస్సు నిమిషమైతే ప్రధాన రహదారికి చేరుకునే సమయం. అంతలోనే విషాదం.. ఘాట్ లోయల్ పడి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 65 మంది ప్రాణాలను బలితీసుకుంది.
Also Read: మలిసంధ్యలో.. మరిచి‘పోలేని’ వేదన
నాటి ఆ మరకలు ప్రజల్లో ఇంకా తొలగడం లేదు. ఆ విషాదాన్ని ఇంకా ఆ గ్రామాల ప్రజలు మరిచిపోవడం లేదు. ఘటన జరిగి రెండేళ్లు అవుతున్నా ఆ కళ్లల్లో నుంచి ఇంకా నీటి సుడులు తొలగడం లేదు. ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. చిన్నారులను కోల్పోయారు. ఎందరో బిడ్డలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు.
ఆ విషాదకర దుర్ఘటనలో చనిపోయిన తన తండ్రి జ్ఞాపకాల నుంచి చిన్నారి అక్షిత ఇంకా బయటపడలేపోతోంది. రెండేళ్ల క్రితం కట్టిన తండ్రి సమాధిపై కూర్చుని తొమ్మిదేళ్ల పాప వెక్కివెక్కి ఏడిచింది. ఆ పాపను ఓదార్చడం స్థానికుల వల్ల ఏమాత్రం కాలేదు.
Also Read: కర్ర విరగలేదు.. పామును చంపిన కేసీఆర్?
కొండగట్టు ప్రమాదంలో జగిత్యాల జిల్లా కొడిమ్యల మండలం రాంసాగర్ గ్రామానికి చెందిన ద్యాగాల స్వామి కూడా చనిపోయాడు. దీంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. అప్పటి నుంచి ద్యాగాల స్వామి కుమార్తె మనోవేదనలోనే ఉండిపోయింది. ప్రమాదం జరిగి రెండేళ్లు గడిచాయి. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకుంది. రెండు రోజులుగా సమాధి దగ్గరే కూర్చొని ఆ చిన్నారి ఏడుస్తోంది. తన తండ్రి సమాధిపై పూలు వేస్తూ అక్కడే ఉండిపోయింది. ఇది చూసి స్థానికులు కూడా కంటతడి పెట్టుకుంటుండడం కలచివేసింది.