Homeగెస్ట్ కాలమ్చదువుల సంగతి ఏమి కానుంది?

చదువుల సంగతి ఏమి కానుంది?

Study in Telangana

రేపటి తరం చదువులు ఇప్పటికే మూడు మాసాలు మురిగి పోయినాయి. కరోనా ఇప్పుడిప్పుడే శాంతి ఇంచదు అని చెప్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయం లో చీమ కుట్టినట్లు కూడా లేదు. అక్కడికి ప్రైవేట్ బళ్ళ యజమానులు తమ ఫీజుల కోసమే అయినా ఏదో ఓ ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాలకు ఆదాయం తెచ్చిపెట్టే మద్యం దుకాణాలకు ఏ ఇబ్బందీ లేదు. పెద్ద పెద్దోళ్ల సాప్ట్ వేర్ కంపెనీల కు ఏ ఇబ్బంది లేదు. ఆన్లైన్ కోర్టులు ఆఫీస్ లు  కూడా నడుస్తున్నాయి అంటే  నడుస్తున్నాయి. డాక్టర్లు, నర్సులు తగిన  రక్షణ చర్యలు తీసుకొని ప్రాణాలకు తెగించి పనిజేస్తున్నరు. చదువుల వద్దకు వచ్చే వరకు సమస్య వస్తున్నది. పసి పిల్లల ను  ఒక్క దగ్గరకు తెచ్చి కూర్చో బెట్టి చదువులు చెప్పడం ఈ పరిస్తితిలో చాలా ప్రమాదకరం. మరి ఎలా చేద్దాం అనే దానికి వ్యక్తులు గా మనకు తోచిన సలహాలు మనం చెప్పవచ్చు. కానీ మన సలహాలు పరిగణన లోకి తీసుకొని ప్రభుత్వ నిర్ణయం ఆచరణ సాధ్యం ఆయ్యే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే  అది ఆచరణ సాధ్యం అవుతుంది.నిన్న నేను అమెరికాలో ఉన్న 6వ తరగతి కలిగిన  మా మనుమరాలు తో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి ఒక విషయం చెప్పింది. క్యాలిపో ర్నియాలో ఉన్న తనకు టెక్సాస్  లో ఉన్న 10th స్టాండర్డ్ అమ్మాయి రోజు ఒక గంట పాటు ఉచితంగా బోధిస్తుందట. అట్లా చాలా మంది one to one కు బోధనచేస్తున్నారట. మనకు ఇక్కడ అర్బన్ ఏరియా లో ఈ విధానం సాధ్య పడుతుంది. అలాగే నాలాంటి చాలా మంది రిటైర్డ్ ఉపాధ్యాయులు, సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయుల సేవలు ఉచితంగా అందివ్వడానికి సిద్దంగా యుండి ఉంటారు. కావాల్సిందల్లా ఎవరైనా ఒకరు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు ఇందుకు పూనుకుంటే ఇది పెద్ద కష్టసాధ్యమైన విషయం కాదు. చూద్దాం ఈ వ్యాసం చదివిన తర్వాత ఎవరైనా ఒక సామాజిక స్పృహ కలిగిన టెక్నో క్రాట్ ముందుకు వస్తాడని ఆశిద్దాం.  ప్రభుత్వమే పూనుకుంటే ఇంకా మంచిది.

Also Read: కర్ర విరగలేదు.. పామును చంపిన కేసీఆర్?

ఇక గ్రామీణ ప్రాంతాల పిల్లలను ఇప్పుడు బస్సుల్లో, ఆటోలో ఒకరి పై ఒక రిని కుక్కి  పంపడం శ్రేయస్కరం కాదు. మరి ఎలా చేయొచ్చు? రెగ్యులర్ ఉపాధ్యాయులు ఒక్కరిద్దరు పిల్లలను వారి ఇండ్ల వద్దనే  దూర దూరంగా కూర్చోబెట్టి బోధించ వచ్చు. అలాగే ఈనాటి పరిస్తితిలో ప్రతి గ్రామం లో 10th పాస్ అయిన వాళ్ళు పదుల సంఖ్యలో ఉంటారు. ప్రాథమిక తరగతులకు చెప్పడం వారికి పెద్ద  కష్టం ఏమీ  కాదు. ఆ గ్రామ ప్రజా ప్రతినిధి సర్పంచి , లేదా వార్డు మెంబర్ ఎవరో ఒకరు పూనుకొని ఒకరు లేదా ఇద్దరు పిల్లలను దూరంగా కూర్చోబెట్టి వారి ఇండ్ల వద్దనే  బోధించ వచ్చు. కావాల్సిన దల్లా చిత్త శుద్ది. మరో విషయం ఎట్టి పరిస్తితిలో కూడా పిల్లలను కొట్టడం, తిట్టడం, ఇది రాదా అది రాదా అని అవమాన పరుచ కుండా ఉండడం. ఉపాధ్యాయ శిక్షణ పొందిన, పొందని ఏ బోధకుడైనా ఈ నియమానికి కట్టుబడి ఉండాలి.

ఒక పదిరోజులు నేను మా ఇంట్లో ఉన్న ఓపెన్ ప్లేస్ లో నలుగురు పిల్లలను దూరం దూరంగా మాస్కులతో కూర్చో బెట్టి, నేనూ మాస్క్ ధరించి 5th,7th స్థాయి విషయాలు బోధించిన. వాళ్లకు ఆన్ లైన్ తరగతుల ద్వారా కంటే ఇలా బోధించడం వలన మేలు కలుగుతున్నది అని చెప్పారు. 

పట్టణాల్లో కౌన్సిలర్లు పూనుకున్నా ఇది సాధ్య పడుతుంది. ప్రధానంగా పాఠశాల విద్యా బోధన వరకు ఇలా ప్రయత్నం చేయవచ్చు. నేను ఇంతకు ముందే ఒక వ్యాసం లో చెప్పాను. పిల్లలు ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంటే తప్ప వాళ్ళు స్థిరంగా కూర్చొని ఒక విషయం పట్ల అవగాహన పెంచు కోలేరు అని.

Also Read: కొండగట్టు ఘటనకు రెండేళ్లు.. తండ్రి సమాధి వద్దే కూతురు

కావున సెకండరీ లెవల్ వరకు ఉచితంగా బోధించే ఆసక్తి కలిగిన వారిని గుర్తించి వారి సేవలు వినియోగించు కోవాలి. పై స్థాయికి కూడా one to one పద్దతిలో ఆన్లైన్ పద్దతిలో బోధిస్తే చదువుల నష్టాన్ని నివారించ వచ్చు. దీని ఆచరణను ప్రభుత్వం పూనుకొను విధంగా ఒత్తిడి జరుగాలి. నిజానికి ఎవ్వరమో ఉచిత సలహా ఇచ్చే కంటే ముందే ప్రభుత్వం ఈ పని చేయాలి. కానీ ప్రభుత్వాలకు ఎంత సేపూ భావావేశాలతో ఆడుకోవడం, ప్రజల కష్టార్జితాన్ని పెట్టుబడి దారుల కు దోచి పెడుతూ తమ వాటా తాము పొందడం లో ఉన్న శ్రద్ధ ప్రజల జీవన్మరణ సమస్యల పరిష్కారం లో లేదు. అలా  ఉండక పోవడానికి కారణం  ప్రజల చైతన్యం పాలకులను ప్రశ్నించి నిలదీసే స్థాయిలో లేక పోవడమే. కావున ప్రశ్నించే స్థాయిని పెంచుకుందాం. పిల్లల చదువులకు ఇంకా నష్టం జరుగకుండా ,  పాలకులు పట్టించుకోని ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా విద్యా బోధన కు ప్రభుత్వం పూనుకోవాలని ఒత్తిడి చేద్దాం. చేజారి పోయిన ప్రభుత్వరంగ విద్య పరిస్థితిని, ప్రస్తుత కోవిద్19  పరిస్థితిని అవకాశంగా తీసుకొని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రగతికి కాము కా విద్యార్థి సంఘాలు అందిపుచ్చుకొని ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు ముందుకు వస్తారని ఆశిద్దాం.


ఎవ్వరో ఒక్కరూ ముందుకు వచ్చినా ఎంతో కొంత ఫలితాన్ని ప్రజల ముందు పెట్టవచ్చు. ప్లీజ్ ఆచరణకు పూనుకుందాం.
 
-వీరగొని పెంటయ్య.
విశ్రాంత విద్యాపర్యవేక్షణాధికారి.( AMO ) 
NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version