BR Naidu : ఇలాంటి భేటీలు బయటికి సాధారణంగా కనిపించినప్పటికీ.. లోపల అసాధారణమైన చర్చలు జరగకుండా ఉండవు. టిటిడి చైర్మన్ గా టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడు ఎన్నికైన తర్వాత.. చైర్మన్ హోదాలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అన్యమతస్తులను ఇతర శాఖలకు పంపించడం.. తిరుమల కొండపై శారదా పీఠానికి కేటాయించిన భూములను రద్దు చేయడం.. ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.. భేష్.. ఇలాంటివి అమలు చేయాలని ఆశిద్దాం.. టీటీడీ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత బిఆర్ నాయుడు.. కేటీఆర్ ను కలవడం తెలంగాణ రాజకీయాల్లో ఒకింత చర్చకు దారి తీస్తోంది. దీనిని భారత రాష్ట్రపతి నాయకులు హైలెట్ చేసుకుంటున్నారు..”చూశారా.. ముఖ్యమంత్రిగా రేవంత్ ఉన్నప్పటికీ.. బి ఆర్ నాయుడు నేరుగా కేటీఆర్ దగ్గరకు వచ్చారు.. అది కేటీఆర్ కు ఉన్న వ్యాల్యూ.. ఆ వాల్యూ తెలుసు కాబట్టే బి.ఆర్ నాయుడు వచ్చారు. కేటీఆర్ ను కలిశారు. కేటీఆర్ అడిగితే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు కూడా పరిగణలోకి తీసుకుంటామని బిఆర్ నాయుడు చెప్పారు” ఇలా సాగిపోతోంది భారత రాష్ట్ర సమితి నాయకుల సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన సందేశాల పరంపర. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. ముఖ్యమంత్రి అనే వ్యక్తికి పరిపాలనకు సంబంధించిన పనులు నిత్యం ఉంటాయి. పైగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ మాత్రం ఖాళీగా ఉండడం లేదు.. బి ఆర్ నాయుడు కేటీఆర్ ను కలిసినప్పుడు… రేవంత్ రెడ్డి వేములవాడలో ఉన్నారు. ప్రజా పాలన ఏడాది ఉత్సవాలలో ఆయన పాల్గొంటున్నారు. అలాంటప్పుడు రేవంత్ రెడ్డిని బీఆర్ నాయుడు కలిసి అవకాశాలు లేకపోవచ్చు. అయినా టీటీడీ అనేది రాజకీయ సంస్థ కాదు కదా.. బి.ఆర్ నాయుడు ఉభయకుశలోపరి లాగా ఉంటేనే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉపయోగం ఉంటుంది. ఒకవేళ బిఆర్ నాయుడు కోపాలను తాపాలను, ఆశ్రితపక్షపాతాన్ని జగన్ మీద చూపించవచ్చు.. అందులో తప్పులేదు. ఎందుకంటే బి ఆర్ నాయుడు నియామకం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాగింది కాబట్టి.. పైగా అది నామినేటెడ్ పోస్టుల్లో ఒకటి కాబట్టి..
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు ప్రాధాన్యం ఇస్తారా
ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఈ సమయంలో తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధుల సిఫారసులేఖలకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. నేరుగా అక్కడ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. నిన్న కేటీఆర్ కూడా బీర్ నాయుడు తో ఇదే విషయాన్ని తెలిపారు. నమస్తే తెలంగాణ కూడా ఇదే రాస్కొచ్చింది. అంటే ఈ లెక్కన తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ముందుగానే బయటికి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే విషయాన్ని బిఆర్ నాయుడు ముందు పెట్టారు కాబట్టి.. తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధుల సిఫారసులేఖలకు టీటీడీ ఇకనైనా ప్రాధాన్యం ఇస్తుందో చూడాలి. అన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తున్న భక్తులలో తెలంగాణ ప్రాంతం నుంచే అధికం. అలాంటప్పుడు చైర్మన్ గా ఎన్నికైన బి.ఆర్ నాయుడు ఇకనైనా ఆశ్రిత పక్షపాతం లేకుండా వ్యవహరించాలని తెలంగాణ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. అన్నట్టు రేపటి నాడు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు టిటిడి ప్రాధాన్యమిస్తే దానిని తమ నాయకుడు కేటీఆర్ క్రెడిట్ అని భారత రాష్ట్రసమితి నాయకులు ఖచ్చితంగా ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే ప్రస్తుతం వారు సాగిస్తున్న సోషల్ ప్రచారం అలా ఉంది మరి.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Ttd chairman b r naidu meets brs leader ktr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com