భక్తులకు అలర్ట్.. కరోనా నెగటివ్ వస్తేనే పుష్కరాలకు అనుమతి..?

తెలుగు రాష్ట్రాలలో ఈ నెల 20వ తేదీ నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. 2008 సంవత్సరంలో తుంగభద్ర పుష్కరాలు జరగగా 12 ఏళ్ల తరువాత 12 రోజుల పాటు నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు పుష్కరాలు జరగనున్నాయి. అయితే కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలను తీసుకుంది. తుంగభద్ర పుష్కరాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వం మార్గదర్శకాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 […]

Written By: Navya, Updated On : November 18, 2020 2:17 pm
Follow us on


తెలుగు రాష్ట్రాలలో ఈ నెల 20వ తేదీ నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. 2008 సంవత్సరంలో తుంగభద్ర పుష్కరాలు జరగగా 12 ఏళ్ల తరువాత 12 రోజుల పాటు నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు పుష్కరాలు జరగనున్నాయి. అయితే కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలను తీసుకుంది. తుంగభద్ర పుష్కరాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది.

ప్రభుత్వం మార్గదర్శకాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తామని పేర్కొంది. 65 సంవత్సరాల పై బడిన వారిని, పిల్లలను, గర్భిణీలను పుష్కరాలకు రావొద్దని ప్రభుత్వం కోరింది. పుష్క‌ర‌ఘాట్ల‌లోకి కరోనా నెగిటివ్ రిపోర్టుతో వస్తే మాత్రమే భక్తులను అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. కరోనా నెగిటివ్ రిపోర్టులు లేకపోతే థర్మల్ స్క్రీనింగ్ అనంతరం భక్తులను పుష్కర్ ఘాట్లలోకి అనుమతించనున్నారు.

ప్రభుత్వం కరోనా నిబంధనలకు భక్తులకు అనుమతులిస్తున్న నేపథ్యంలో భక్తులు మాస్క్ ధరించి, ఆరు అడుగుల దూరం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి రెండు రోజుల క్రితం పుష్కరాలకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ సర్కార్ పుష్కరాల నిర్వహణ కోసం రెండున్నర కోట్ల రూపాయలు విడుదల చేసింది.

ప్రభుత్వం విడుదల చేసిన నగదుతో అధికారులు పుష్కర ఘాట్ల దగ్గర మౌలిక వసతుల కల్పనతో పాటు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి భక్తులు నిబంధనలు పాటిస్తూ పూజలు, పిండ ప్రధానాలు చేయాలని.. అధికారులు భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు.