
తాను టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నాననే వార్తలపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పందించారు. తాను ఎప్పటికీ టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. కొంతమంది తనపై తప్పడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మలకు టికెట్ ఇవ్వనప్పటి నుంచి ఆయనను కేసీఆర్ పట్టించుకోవడం లేదని, దీంతో తుమ్మల తీవ్ర అసంత్రుప్తితో ఉన్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తనకు ఏ పదవీ ఇవ్వకున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుండి అందరినీ గెలిపించారు. ఇటీవల బీజేపీ బలపడుతుండడంతో ఆయన బీజేపీలోకి చేరుతారని వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై వెంటనే స్పందించిన తుమ్మల నాగేశ్వర్ రావు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తాను ఎప్పటికీ టీఆర్ ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.