
ప్రభుత్వం మాంసం దుకాణాలు నిర్వహించాలని చూస్తోంది. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇకపై ప్రభుత్వ ఆధ్వర్యంలో మాంసం విక్రయాలు చేయనుంది. వినియోగదారుడికి సరసమైన ధరలకు మాంసం అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మాంసం దుకాణాలతోపాటు చేపల మార్కెట్ నిర్వహణ కోసం కూడా కసరత్తు చేపడుతోంది. ప్రజలకు మంచి చేపలు అందుబాటులో ఉంచి మాంస ఉత్పత్తులను పెంచాలని భావిస్తోంది.
జీహెచ్ఎంసీ పరిధిలోనే దాదాపు పదివేల మాంసం దుకాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో రెండు వేల దుకాణాలకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. మిగతా వాటికి లేదు. దీంతో ప్రభుత్వం అన్ని మాంసం దుకాణాలను తన ఆధీనంలోకి తీసుకుని ప్రభుత్వమే మాంసం సరఫరా చేస్తూ ధరలు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
మరో వైపు ఇప్పటివరకు కబేళాలను మాత్రం ప్రభుత్వమే నిర్వహిస్తోంది. కానీ ఇప్పుడు మాంసంతోపాటు కబేళాల నిర్వహణ కూడా చూసుకుంటుంది. దీంతో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మాంసం ధరలు అందుబాటులో ఉంటూ ప్రజలకు నాణ్యమైన మాంసం దక్కే అవకాశమేర్పడుతుందని తెలుస్తోంది. ఇంకా పరిశుభ్రతకు కూడా పెద్దపీట వేస్తోంది. అపరిశుభ్రమైన వాతావరణంలో మాంసం తీసుకుంటే రోగాలు వచ్చే అవకాశమున్నందున పరిశుభ్రమైన మాంసాన్ని అందించే ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణలో మత్స్య సంపద పెరుగుతోంది. ఇతర ప్రాంతాలకు రవాణా చేసే స్థాయికి రాష్ర్టం చేరుకుంది. దీంతో చేపల మార్కెట్ కూడా ప్రభుత్వం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లకు చేపలను విక్రయించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రణాళిక తయారు చేస్తోంది. దీనిపై ప్రతిపక్షాలు మాత్రం ఇంతవరకు ఏ నిర్ణయం ప్రకటించలేదు.