https://oktelugu.com/

కరోనాలోనూ తగ్గేది లేదంటున్న యువ హీరోలు..!

టాలీవుడ్లో ప్రస్తుతం యువ హీరోల హవా కొనసాగుతోంది. స్టార్ హీరోలకు ధీటుగా యువ హీరోలు సినిమాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. స్టార్ హీరోలంతా ప్యాన్ ఇండియా సినిమాలతో బీజీగా మారుతుండగా యువ హీరోలు మాత్రం టాలీవుడ్లో సత్తా చాటుతున్నారు. కరోనా క్రైసిస్ లోనూ యువ హీరోలు వరుస సినిమాలు చేస్తూ బీజీగా మారుతుండటం గమనార్హం. Also Read: ఆనంద్ దేవరకొండకు మద్దతుగా నిలిచిన ‘అర్జున్ రెడ్డి’..! ‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ బాలీవుడ్ ను మించిపోయింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 23, 2020 / 03:32 PM IST

    Tollywood heros

    Follow us on

    టాలీవుడ్లో ప్రస్తుతం యువ హీరోల హవా కొనసాగుతోంది. స్టార్ హీరోలకు ధీటుగా యువ హీరోలు సినిమాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. స్టార్ హీరోలంతా ప్యాన్ ఇండియా సినిమాలతో బీజీగా మారుతుండగా యువ హీరోలు మాత్రం టాలీవుడ్లో సత్తా చాటుతున్నారు. కరోనా క్రైసిస్ లోనూ యువ హీరోలు వరుస సినిమాలు చేస్తూ బీజీగా మారుతుండటం గమనార్హం.

    Also Read: ఆనంద్ దేవరకొండకు మద్దతుగా నిలిచిన ‘అర్జున్ రెడ్డి’..!

    ‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ బాలీవుడ్ ను మించిపోయింది. ఈ సినిమాలో నటించిన ప్రభాస్ క్రేజ్ వరల్డ్ వైడ్ అయింది. ప్రభాస్ లాగే మహేష్ బాబు.. ఎన్టీఆర్.. రాంచరణ్.. బన్నీ ప్యాన్ ఇండియా స్టార్లుగా మారుతున్నారు. వరుసగా ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ రేంజును మరింత పెంచుతున్నారు.

    Also Read: ఈసారి కూడా ‘బిగ్ బాస్’ వారికి హ్యండిచ్చినట్టేనా?

    స్టార్ హీరోలు ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తుండగా యువ హీరోలు మాత్రం టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బీజీగా మారతున్నారు. న్యాచురల్ స్టార్ నాని కరోనా క్రైసిస్ లోనూ నాలుగైదు సినిమాలను చేస్తున్నాడు. వీరితోపాటు విజయ్ దేవరకొండ.. నిఖిల్.. అడవి శేష్.. రామ్.. శర్వానంద్.. సాయితేజ్ వంటి హీరోలు పలు మూవీలకు కమిట్ అవుతూ బీజీగా మారుతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    నాని వరుసగా ప్లాపులతో ఇబ్బందిపడుతున్న ఆ ప్రభావం అతడి తదుపరి సినిమాలపై ఏమాత్రం పడటం లేదు. ఇక విజయ్ దేవరకొండ ‘ఫైటర్’తో సత్తాచాటాలని చూస్తున్నాడు. హీరో రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’తో మళ్లీ లైన్లోకి వచ్చారు. రెడ్ మూవీతో స్టార్ హీరోగా మారాలని భావిస్తున్నాడు. అడవి శేష్.. నిఖిల్ సైలెంట్ గా హిట్స్ కొడుతున్నారు. అలాగే శర్వానంద్.. సాయితేజ్ మళ్లీ ఫామ్లోలోకి వచ్చేందుకు సన్నహాలు చేసుకుంటున్నారు.