Site icon OkTelugu

Mad For Each Other Show: గందరగోళంగా మారిన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షో.. మాస్క్ మ్యాన్ హరీష్ ని ఉతికి ఆరేసిన అనీల్ రావిపూడి!

Mad For Each Other Show

Mad For Each Other Show

Mad For Each Other Show: ఈమధ్య కాలం లోనే స్టార్ మా ఛానల్ లో మొదలైన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షో విజయవంతంగా రన్ అవుతూ మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని నమోదు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మొదట్లో ప్రోమోలు చూసినప్పుడు ఇది చాలా పెద్ద సుత్తి రియాలిటీ షో అని అంతా అనుకున్నారు. కానీ రెండు మూడు ఎపిసోడ్స్ చూసిన తర్వాత పర్వాలేదు , షో లో విషయం ఉంది అంటూ ప్రతీ ఒక్కరు చెప్పుకొచ్చారు. అయితే రెగ్యులర్ ఎపిసోడ్స్ కంటే , వీకెండ్ లో వచ్చే ఎపిసోడ్స్ చూసేందుకు చాలా బాగా అనిపించేట్టు ఉన్నాయి. గడిచిన మూడు ఎపిసోడ్స్ బాగానే ఉన్నాయి కానీ, ఎక్కడో స్పైసీ మిస్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ వీకెండ్ ఎపిసోడ్స్ మాత్రం గొడవలతో నిండిపోయింది. లేటెస్ట్ ప్రోమో లో మీరంతా చూసే ఉంటారు.

Also Read: టోర్నీకి ముందే చెన్నై పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి.. ఎవరు కాపాడుతారు?

ఎప్పుడూ సరదాగా ఉండే అనిల్ రావిపూడి ఫైర్ అవుతూ వార్నింగ్ ఇవ్వడం అందరికీ కొత్తగా కనిపించింది. అయితే అనిల్ అలా ఫైర్ అవ్వడానికి కూడా కారణం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈ ఎపిసోడ్ లో ‘రియల్ ఆర్ ఫేక్ ‘ జోడీలు ఎవరో చెప్పమని ప్రతీ జంటని అడుగుతారు. అలా మాస్క్ మ్యాన్ హరీష్ , హరిత జంట వంతు వచ్చినప్పుడు, వాళ్ళు నటరాజ్ మాస్టర్, నీతూ జంటని రియల్ జోడీ అని, నూక రాజు, ఆసియా జంట ని ఫేక్ అని పెడుతారు. దీనికి నూక రాజు చాలా ఫైర్ అయిపోతాడు, ఎమోషనల్ అవుతాడు, అతన్ని ఆపడానికి రాధ క్రిందకు దిగి వస్తుంది, అయినా కూడా కంట్రోల్ అవ్వడు. ప్రోమో లో అనిల్ రావిపూడి హరీష్ పై ఫైర్ అయ్యాడని అంతా అనుకోవచ్చు, కానీ అక్కడ ఆయన ఫైర్ అయ్యింది నూకరాజు మీద మాత్రమే. ఈ షో చూసిన తర్వాత మీ అందరికీ కూడా నూకరాజు చాలా ఓవర్ యాక్షన్ చేసాడని అనిపిస్తుంది.

అనిల్ రావిపూడి రెండు జంటలకు వార్నింగ్ ఇస్తూ, ఒక్కసారి జడ్జీలు ఆపమని చెప్పినప్పుడు, వెంటనే ఆపేయండి, తర్వాత కావాలంటే మీరు వాదనలు చేసుకోవచ్చు కానీ, ఆపమని చెప్పినప్పుడు ఆపండి అని అంటాడు. చివర్లో నూక రాజు కి వార్నింగ్ ఇస్తూ ‘ముందు నువ్వు నీ కోపాన్ని తగ్గించుకో, నీకు ఇదే చివరి వార్నింగ్. ఎవరైనా వాళ్ళ అభిప్రాయం చెప్పినప్పుడు తీసుకో, ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు’ అంటూ మండిపడ్డాడు. అనిల్ రావిపూడి లాంటి ఫన్నీ పర్సన్ కే కోపం తెప్పించారంటే వీళ్ళు ఏ రేంజ్ లో ప్రవర్తించారో మీరే అర్థం చేసుకోండి. రాబోయే రోజుల్లో కచ్చితంగా ఆయన దాగున్న ఫైర్ ని బయటకు తీసుకొచ్చేలా ఉన్నారు ఈ జోడీలు.

Exit mobile version