SBI
SBI: ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఏ రంగాన్ని కూడా వదలడం లేదు. రకరకాల పద్ధతిలో ప్రజలను మోసం చేసి దోచేస్తున్నారు. ఇంతకు సైబర్ నేరాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోవడం వల్ల మోసాలు ఎక్కువ అవుతున్నాయి. మోసాలు చేయడానికి కొత్త ప్లాన్‌లు వేసి నమ్మిస్తున్నారు. ఇలాంటి మోసాల బారిన పడవద్దని అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంటారు. అయిన కూడా సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని, డిజిటల్ అరెస్టు అంటూ మోసాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆఖరికి బ్యాంకుల పేరుతో మోసాలు చేస్తున్నారు. కొందరు అకౌంట్లకు డబ్బులు వేసి వారికి ఆశ చూపుతున్నారు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వమని అడుగుతారు, ఒకవేళ ఇవ్వకపోతే వారు చేసే మోసాల్లో హ్యాండ్ కలపమంటారు. ఇలా చేశారు అనుకోండి.. మీరు మధ్యలో ఇరుక్కుంటారు. అయితే ఇలా రోజుకో కొత్త రకం మోసాలు వస్తున్నాయి. వీటి బారిన పడకుండా ఉండేందుకు ఎస్‌బీఐ కస్టమర్లకు కొన్ని సూచనలు చేసింది.
చాలా మోసాలకు పాల్పడే వారు బ్యాంకు పేరుతో కొన్ని స్కీమ్‌లు వచ్చాయని యాడ్‌లు ఇస్తారు. కేవలం స్కీమ్‌లు అనే కాకుండా ఇన్వెస్ట్ చేయమని, ఫిక్సిడ్ డిపాజిట్, మనీ సేవ్ చేయడం కోసం వంటి ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేస్తారు. ఈ ప్రకటలను చూసిన వారు వెంటనే వారిని సంప్రదిస్తారు. ఏది అయిన తక్కువ ధరకే వస్తుందంటే ఆశ పుడుతుంది. దీంతో మోసానికి పాల్పడిన వారు కూడా వెన్నతో పూసినట్లు మాట్లాడతారు. లాభాలు వస్తాయని మనకి ఆశ చూపిస్తారు. వెంటనే ఇక అందులో ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకేముంది ఇన్వెస్ట్ చేశాక వారు మోసానికి పాల్పడ్డారని తెలిసిన ఏం చేయలేని పరిస్థితి. అందుకే ఇలాంటి మోసాల బారిన పడవద్దని ఎస్‌బీఐ తెలిపింది. ఎస్‌బీఐ లోగో ఏ ప్రకటన వచ్చిన నమ్మేయవద్దని తెలిపింది. డీప్ ఫేక్ లేకపోతే నిజమైనది ఏదో తెలుసుకోండి.
ఏవైనా ప్రకటనలు ఉంటే అధికారిక వెబ్‌సైట్, అధికార అకౌంట్‌లో తెలుపుతామని వెల్లడించింది. బ్యాంకు అధికారుల పేర్లతో వస్తున్న నకిలీ ప్రకటనలను కూడా నమ్మవద్దు. చాలా మంది బ్యాంకు అధికారులు అని మోసం చేస్తున్నారు. ఇలాంటి నకిలీ ప్రకటనల బారిన పడవద్దని తెలిపింది. ఎస్‌బీఐలో ఇన్వెస్ట్ చేస్తే పెద్ద మొత్తంలో రాబడులు వస్తాయని ప్రకటనలు నమ్మవద్దు. తన బ్యాంకు ఎప్పుడూ కూడా ఇలాంటి హామీలు ఇవ్వదని, ఇలాంటి ప్రకటనలు అబద్ధమని తెలిపింది. కొందరు మీకు లాటరీ వచ్చిందని, బ్యాంకులో ఆఫర్ ఉందని, నేను బ్యాంకు మేనేజర్ మీకు మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఇస్తామంటే నమ్మవద్దు. ఎందుకంటే అందరికీ కూడా బ్యాంకులో ఒకలాంటి స్కీమ్‌లే ఉంటాయి. ఇలాంటి ప్రకటనలను నమ్మి మోసపోవద్దని జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బీఐ కస్టమర్లను సూచించింది.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Banks key instructions for sbi customers must follow in the new year
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com