https://oktelugu.com/

KCR Birthday: ఉద్యమానికి ఊపిరి.. అభివృద్ధికి సారథి.. చరిత్రలో ఆయనే ఒక అధ్యాయం!

కేసీఆర్‌.. ఈ పేరు తెలియని తెలంగాణ వాసి లేదు. కేసీఆర్‌ అనే మూడు అక్షరాలు తెలంగాణ చరిత్రలో ఓ అధ్యాయం. తెలంగాణ వాసులు 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరడానికి, తెలంగాణ రాష్ట్రం మన ముందు సాక్షాత్కారం కావడంలో కేసీఆర్‌ పాత్ర ఎవరూ కాదనలేనిది. నేడు కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం.

Written By: , Updated On : February 17, 2025 / 04:17 PM IST
KCR Birthday

KCR Birthday

Follow us on

KCR Birthday:  ఉమ్మడి రాష్ట్రం భావన పెరిగిపోయి.. ఇక ప్రత్యేక రాష్ట్రం అసాధ్యం అనుకున్న తరుణంలో.. స్వరాష్ట్ర కాంక్ష రగిల్చి.. దానిని సుపాధ్యం చేసిన నేత కేసీఆర్‌. సాహసోపేతమైన రాజకీయ అడుగు వేశారు. ఆయకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన రాజకీయ అడుగుకు ఓ నాంది. టీఆర్‌ఎస్‌ను స్థాపించి దాదాపు దశాబ్దం నర పోరాటం తర్వాత కేసీఆర్‌ స్వప్నం సాకారమైంది. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కేసీఆర్‌ దిట్ట. రాజకీయ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధించవచ్చని నమ్మి.. ఎక్కడా దారి తప్పకుండా పోరాటం చేశారు. అనేక పోరాటాలకు ఊపిరి అయ్యాడు. సబ్బండ వర్గాలను ఉద్యమంలో భాగస్వాములను చేశారు. ప్రజల్లో సొంత రాష్ట్రం భావన పెంచి.. స్వరాష్ట్ర సాధనకు సారథ్యం వహించారు. కొన్నిసార్లు ఎదురుదెబ్బలు తగిలినా.. లెక్క చేయకుండా ఎంచుకున్న మార్గంలోనే ప్రయాణం సాగించాడు. స్వరాష్ట్రం సాధించాడు. తెలంగాణ కాంక్ష చల్లబడకుండా ఉప ఎన్నికలతో రాజకీయాలు చేశారు. ఓ దశలో రాజశేఖరరెడ్డి రాజకీయంలో టీఆర్‌ఎస్‌ ఆయన చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. అయితే రెండు నెలల వ్యవధిలోనే వైఎస్సార్‌ మరణించడం.. ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో ఉద్యమం మరోమారు ఉవ్వెత్తున ఎగిసింది. ఉద్యమాన్ని రగిలించడంలో కేసీఆర్‌ దిట్ట. ఆమరణ దీక్ష అస్త్రాని సంధించి తెలంగాన ప్రకటన వచ్చేలా చేశారు.

అభివృద్ధికి బాటలు..
ఇక తెలంగాణరాష్ట్రం సిద్ధించాక సీఎం అయ్యారు కేసీఆర్‌. ముఖ్యమంత్రిగా దశాబ్దకాలంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త రాష్ట్రాన్ని అనేక రాష్ట్రాలకన్నా ముందు నిలబెట్టారు. అభివృద్ధిలో అగ్రస్థానానికి తీసుకెళ్లారు. తెలంగాణలో ఎంతో దిగువన ప్రవహించే గోదావరి నదిని ఎత్తిపోసుకునేందుకు కాళేశ్వరం నిర్మించారు. ఈ కాళేశ్వరం నిర్మాణానికి ఈ రోజు అయితే రూ.5 లక్షల కోట్లు ఖర్చు చేయాలని కేసీఆర్‌ కేవలం రూ.లక్ష కోట్లతో నిర్మించారు. ఇక పదేళ్ల తెలంగాణలో పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయి. వలసలు తగ్గాయి. పంటలు బాగా పండాయి. ఇది పూర్తిగా కేసీఆర్‌ క్రెడిటే. అనేక సంక్షేమ పథకాలతో కేసీఆర్‌ ప్రజలకు దగ్గరయ్యారు. రైతుబంధు పథకం కేసీఆర్‌తోనే సాధ్యమైంది.

తప్పులు చేయనివారుండరు..
కేసీఆర్‌ అన్నింటిలో పర్‌ఫెక్ట్‌ కాకపనోవచ్చు. ప్రతీ విషయంలో సక్సెస్‌ ఎవరికీ సాధ్యం కాదు. కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిలో దళిత సీఎం, పేదలకు మూడుకరాల భూమి, డబుల్‌ బెడ్రూం ఇళ్లు లాంటి హామీలు హామీలుగానే మిగిలిపోయాయి. ఉద్యమ నినాదం అయిన నీళ్లు, నిధులు, నియామకాలలో నియామకాలను పక్క పెట్టేశారు. కుటుంబంలో రాజకీయ ఉద్యోగులు పెరిగారు. కొన్ని తప్పుడు నిర్ణయాలతో గత ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోలేకపోయారు. ఇక ఆయన చేసిన మరో పెద్ద తప్పు.. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చడమే. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా.. మోదీని చూసి.. తాను దేశ్‌కీనేత కావాలనుకున్నారు. కానీ, ఈ క్రమంలో నేల విడిచి సాము చేయడం కూడా తెలంగాణలో వ్యతిరేకతకు కారణమైంది. కేసీఆర్‌ కొడితే గట్టిగానే కొడతారంటారు.. మరోసారి కొట్టకుండా ఉంటారని అనలేం. అయితే కేసీఆర్‌ దేశ్ కీ నేత అయితే గర్వించేది కూడా తెలంగాణే. కానీ తప్పుడు హామీలతో ఎవరూ ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. ఏది ఏమైనా తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం కేసీఆర్‌ పేరు ఉంటుంది. ఆయన అధ్యాయం ఉంటుంది.