https://oktelugu.com/

Chandoo Mondeti : ఆయనతో సినిమా చేయడం నా కల.. మనసులో విషయం బయటపెట్టిన తండేల్ డైరెక్టర్

చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించకపోవచ్చు కానీ అది సాధించి పెట్టిన విజయం మాత్రం కలకాలం గుర్తుండిపోవాలని అనుకుంటారు సినిమా వాళ్లు.

Written By: , Updated On : February 17, 2025 / 04:22 PM IST
Chandoo Mondeti

Chandoo Mondeti

Follow us on

Chandoo Mondeti : చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించకపోవచ్చు కానీ అది సాధించి పెట్టిన విజయం మాత్రం కలకాలం గుర్తుండిపోవాలని అనుకుంటారు సినిమా వాళ్లు. అందుకే ప్రతి సినిమాని ఎంతో కష్టపడి చాలా ఆలోచనలతో చేస్తుంటారు. విడుదల అయిన తర్వాత సినిమా ఫలితం సంగతి పక్కన పెడితే.. పడిన కష్టానికి తగి ప్రతిఫలం ప్రశంసల రూపంలో వచ్చినా చాలని అనుకుంటారు. కొన్ని రెండూ తీసుకొస్తే ఆ ఆనందమే వేరు. అలాంటి ఆనందంలోనే ఉంది ప్రస్తుతం తండేల్ టీం.

దర్శకుడు చందు మొండేటి (Chandoo Mondeti) ‘తండేల్’ (Thandel) సినిమాతో రీసెంట్‌గా మంచి సక్సెస్ అందుకున్నారు. సినిమాకు వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి. డబ్బులతో పాటు ప్రశంసలు కూడా రావడంతో తన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో రూ. 100 కోట్ల మాట అనేది మినిమమ్ బెంచ్ మార్క్ గా మారిపోయింది. స్టార్ హీరోలంతా ఇప్పటికే ఈ క్లబ్ లోకి చేరిపోయారు. మీడియం రేంజ్ హీరోల్లో కూడా చాలామంది హీరోలు వంద కోట్ల మార్క్ అందుకున్నారు. కానీ అక్కినేని హీరోలు మాత్రం ఇప్పటి వరకూ 100కోట్ల మాటను అందుకోలేకపోయారు. కింగ్ నాగార్జున దగ్గర దాకా వచ్చి ఆగిపోతే.. నాగచైతన్య, అఖిల్ లు యాభై కోట్ల క్లబ్ తో సరిపెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ‘తండేల్’ మూవీతో అక్కినేని హీరోల డ్రీమ్ నేరవేరినట్లే కనిపిస్తుంది.

నాగ చైతన్య హీరోగా నటించిన ‘తండేల్’ ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వారం రోజుల్లో రూ. 90.12 కోట్లు వసూలు చేసిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా.. వాలెంటైన్స్ డే నాడు డీసెంట్ కలెక్షన్లను రాబట్టింది. విశ్వక్ సేన్ ‘లైలా’, గౌతమ్ రాజా ‘బ్రహ్మా ఆనందం’ లాంటి కొత్త సినిమాలు విడుదలైనా వాటికి మించి వసూళ్లను సాధించింది. ఓవరాల్ గా 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.

అక్కినేని హీరోలు రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరాలని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎంతగా ఎదురుచూశారో వారి ఎదురు చూపులు ఫలించాయి. ఈ సినిమా అయిపోవడంతో చందూ మొండేటి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటని చాలామంది మదిలో ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 300 ఏళ్ల క్రితం జరిగే ఓ పీరియాడిక్‌ కథని రెడీ చేశానని… స్టార్ తమిళ హీరో సూర్య (Suriya) హీరోగా ఆ సినిమాని చేయాలని కథ చెప్పినట్లు వివరించారు. ఈ సినిమా దాదాపు ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జరుగుతున్న చర్చలపై చాలా నమ్మకంగా ఉన్నాడు. కానీ సూర్య నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రానట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల ఇలా సినిమాతో ఆయన ఇటీవల ఇబ్బందిపడ్డారు. ఈ సినిమా కాకుండా చందూ లైన్లో ‘కార్తికేయ 3’ ఉంది. అలాగే నాగచైతన్యతో (Naga Chaitanya) ‘తెనాలి రామకృష్ణుడు’ చేయాల్సి ఉందని చెప్పారు. తనకైతే నాగార్జున (Nagarjuna) తో సినిమా చేయాలనేది డ్రీమ్ అని చెప్పుకొచ్చారు.