Telugu warriors vs Chennai Rhinos: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో భాగంగా తెలుగు వారియర్స్ (Telugu warriors), చెన్నై రైనోస్ (Chennai rhinos) జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా పోరు జరిగింది. చివరికి తమిళ రైనోస్ జట్టు విజయం సాధించింది. దీనికంటే ముందు తండేల్(Tandel) బృందం విజయోత్సవంలో భాగంగా ఉప్పల్ మైదానంలో సందడి చేసింది. అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) తన తమ్ముడు అక్కినేని అఖిల్ (Akkineni Akhil) కు ముందస్తుగా శుభాకాంక్షలు చెప్పినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఉత్కంఠ భరితంగా తెలుగు వారియర్స్, చెన్నై రైనోస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరికి తెలుగు సెలబ్రిటీల జట్టు తమిళ హీరోల జట్టు చేతిలో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో తెలుగు సెలబ్రిటీల టీం జట్టు కెప్టెన్ అఖిల్ అక్కినేని 12 మందితో ఫీల్డింగ్ చేయించడం విశేషం. రెండు ఓవర్ల పాటు ఆయన 12 మందితో ఫీల్డింగ్ చేయించాడు. తెలుగు వారియర్స్ జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సందర్భంలో.. ఆది సాయికుమార్ స్థానంలో నిఖిల్ సిద్ధార్థ సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా మైదానంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఆది మైదానంలోనే ఉండి బౌలింగ్ చేశాడు. అయితే నిఖిల్ మాత్రం బయటికి వెళ్లకుండా ఫీల్డింగ్ చేస్తూనే ఉన్నాడు.. ప్రేక్షకులు అరుస్తున్నప్పటికీ ఈ విషయాన్ని టీం గుర్తించలేదు. అంపైర్లు కూడా 12 మంది మైదానంలో ఉన్నారన్న విషయాన్ని గుర్తించలేదు. ఆ తర్వాత మరుసటి ఓవర్ లో నాలుగు బంతులు వేసిన తర్వాత సచిన్ జోషి ఈ విషయాన్ని గుర్తుపట్టి.. నిఖిల్ ను నెమ్మదిగా బయటికి పంపించాడు..
మైదానంలో వాగ్వాదం
ఈ మ్యాచ్లో 11 మంది సభ్యులు ఆడాల్సి ఉండగా.. 12 మంది మైదానంలోకి వచ్చి ఫీల్డింగ్ చేశారు. దీంతో చెన్నై జట్టు తెలుగు జట్టుతో వాగ్వాదానికి దిగింది. ఫలితంగా 15 నిమిషాల పాటు మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. చివరికి అఖిల్ మధ్యలోకి వచ్చి కలగజేసుకొని జట్టు సభ్యులకు సర్దుమణిగింది. ఆ తర్వాత అంపైర్లు మ్యాచ్ ను యధావిధిగా కొనసాగించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్లో చెన్నై జట్టు టాస్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్ లో నిర్ణీత 10 ఓవర్లలో మూడు వికెట్ల కోల్పోయి 125 పరుగులు చేసింది. తెలుగు వారియర్స్ జెడ్ మొదటి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల నష్టపోయి 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో చెన్నై జట్టుకు 20 పరుగుల లీడ్ లభించింది. అనంతరం రెండవ ఇన్నింగ్స్ లో 10 ఓవర్లలో 8 వికెట్లను నష్టానికి చెన్నై జట్టు 94 పరుగులు చేసింది. అఖిల్ జట్టు ఎదుట 115 రన్స్ టార్గెట్ విధించింది. కానీ తెలుగు జట్టు 10 ఓవర్లలో ఆరు వికెట్లు వికెట్లు కోల్పోయి 89 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా చెన్నై జట్టు 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.