Times Now-ETG Survey: పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడింది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19న తొలి విడత.. జూన్ 1న చివరి విడత ఎన్నికలు జరుపుతారు. జూన్ లో ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల చేస్తారు. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీ అత్యధికంగా ఎంపి స్థానాలు గెలుచుకుంటుంది? అనే అంశాల ఆధారంగా సర్వేలు చేస్తున్నాయి.. ప్రముఖ జాతీయ న్యూస్ ఛానల్ అయిన టైమ్స్ నౌ- ఈటీజీ రీసెర్చ్ సర్వే ఒపీనియన్ పోల్స్ నిర్వహించింది. దానికి సంబంధించిన ఫలితాలను వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి జరిగే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీకి 8 నుంచి 10 స్థానాలకు వస్తాయని ఆ సంస్థ ప్రకటించింది. ఇక బిజెపికి నాలుగు నుంచి ఆరు పార్లమెంటు స్థానాలు దక్కే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి ఒకటి నుంచి మూడు స్థానాలు దక్కే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తెలంగాణ పరిస్థితి ఇలా ఉంటే దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటక మినహా మిగతా అన్ని ప్రాంతాలలో బిజెపి కంటే కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని టైమ్స్ నౌ ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే పార్టీకి 21 నుంచి 22 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి ఐదు నుంచి ఏడు స్థానాలు వచ్చే అవకాశం ఉందని టైమ్స్ నౌ ప్రకటించింది. గత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బిజెపికి పెద్దగా స్థానాలు రాలేదు. అయితే ఈసారి రెండు నుంచి 6 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏఐ ఏడీఎం కేకు ఒకటి నుంచి మూడు, ఇతరులకు నాలుగు నుంచి ఐదు స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ సర్వేలో ప్రకటించింది.
కేరళ రాష్ట్రంలో బిజెపి ఒకటి, కాంగ్రెస్ ఎనిమిది నుంచి 10, సిపిఎం 6 నుంచి 8, ఐయూఎంఎల్ ఒకటి నుంచి రెండు, ఇతరులు ఒకటి నుంచి రెండు స్థానాలు దక్కించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో బిజెపి 21 నుంచి 23, కాంగ్రెస్ 4 నుంచి 6, జేడీఎస్ కు ఒకటి నుంచి రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. దక్షిణ రాష్ట్రాలలో ఈసారి ఎక్కువగా సీట్లు వస్తాయని బిజెపి భావించినప్పటికీ.. టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో అందుకు విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ గత ఎన్నికల కంటే ఈసారి ఎన్నికల్లో ఈ రాష్ట్రాలలో ఎక్కువ సీట్లు సాధిస్తుండడం విశేషం. అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో గణనీయంగా సీట్లను కోల్పోతుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల కంటే ఎక్కువ పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందనే సంకేతాలు కనిపిస్తుండడం విశేషం. ఇక ఉత్తరాది రాష్ట్రాలలో బిజెపి గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెల్చుకుంటుందని టైమ్స్ నౌ సర్వేలో తేలింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలలో బిజెపి ప్రభంజనం సాగిస్తుందని టైమ్స్ నౌ సర్వేలో తేలింది.
TIMES NOW- @ETG_Research Survey
Andhra Pradesh (Total Seats: 25) || Here are seat share projections-
– YSRCP: 21-22
– BJP: 0
– TDP+JSP: 3-4
– Others: 0Watch as @navikakumar shares more details. pic.twitter.com/CdIxog58lk
— TIMES NOW (@TimesNow) April 4, 2024