Sania Mirza: భరణం కింద సానియా మీర్జా ఎంత తీసుకుందో తెలిస్తే షాక్ కావాల్సిందే..!?

టెన్నిస్ స్టార్ గా ఉన్న సానియా మీర్జా షోయబ్ మాలిక్ 2010వ సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత దుబాయ్ లో స్థిర పడ్డ వీరికి ఇజాబ్ అనే కుమారుడు కూడా ఉన్నాడు.

Written By: Swathi, Updated On : January 23, 2024 6:55 pm
Follow us on

Sania Mirza: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ స్పోర్ట్స్ కపుల్ విడిపోయారంటూ కొంతకాలంగా పలు వార్తలు వచ్చినప్పటికీ వాటిని ఈ జంట పరోక్షంగా ఖండిస్తూ వచ్చింది. అయితే సానియా- షోయబ్ డివోర్స్ తీసుకున్నారని సానియా తండ్రి అధికారికంగా ప్రకటన చేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు.

టెన్నిస్ స్టార్ గా ఉన్న సానియా మీర్జా షోయబ్ మాలిక్ 2010వ సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత దుబాయ్ లో స్థిర పడ్డ వీరికి ఇజాబ్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా సానియా, షోయబ్ దూరంగా ఉంటున్నారు. ఇటీవలే షోయబ్ మాలిక్ పాకిస్తాన్ కు చెందిన నటి సనా జావేద్ ను మూడో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన నెట్టింట్లో వైరల్ గా మారాయి.

సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకుల తీసుకున్న అనంతరం మరో వార్త సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. అదేంటి అనుకుంటున్నారా? సానియా మీర్జా విడాకులు తీసుకున్న తరువాత భరణం ఎంత డిమాండ్ చేసిందనే ప్రశ్న పలువురి మదిలో మెదలాడుతూ ఉంది. కానీ సానియా మాత్రం డివోర్స్ తీసుకున్న సమయంలో భరణం ఏమి వద్దని చెప్పారని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై నెటిజన్లు స్పందిస్తూ ‘దటీజ్ ఇండియన్ గర్ల్ పవర్ ’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

షోయబ్ సానియా మీర్జాను రెండో పెళ్లి చేసుకున్నారనే సంగతి తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకున్న వీరు విడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాదు వీరి విడాకులను సైతం యాక్సెప్ట్ చేయలేకపోతున్నారని తెలుస్తోంది. మరోవైపు సానియా -షోయబ్ విడిపోవడానికి ఓ టాలీవుడ్ స్టార్ హీరోనే కారణం అంటూ సినీ ఇండస్ట్రీలో ప్రచారం జోరుగా సాగుతుంది. గత కొంతకాలంగా ఆ హీరోతో సానియా క్లోజ్ గా ఉంటున్నారని, ప్రైవేట్ పార్టీలు కూడా చేసుకున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. ఈ వార్తలో వాస్తవం ఎంత ఉందనే విషయాన్ని పక్కన పెడితే ఈ విషయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.