Tata Tiago: భారతదేశంలోని ప్రస్తుత మార్కెట్ లోకి ఎన్నో సంస్థలకు చెందిన కార్లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్లతో పాటు సరసమైన ధరలు కూడా ఉంటాయి. అయితే మార్కెట్ లోకి ఎన్ని రకాల కార్లు వచ్చిన వాటిలో తక్కువ ధరకు వచ్చే కార్ల హవా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు.
దేశంలో చాలా వరకు ప్రజలు సామాన్య, మధ్య తరగతి వాళ్లే. ఈ కారణంగా వీరు తక్కువ ధరల్లో వచ్చే కార్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. అయితే తక్కువ ధర అయినప్పటికీ ఫీచర్లు బావుండాలని, మంచి మైలేజీ ఇచ్చే కార్లు కావాలని కోరుకుంటారన్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే.
సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా పలు కార్ల సంస్థలు ఇప్పటికే చాలా మోడల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఎస్.యూ.వీ పేరు గడించింది. ఫీచర్లతో పాటు మైలేజీని కూడా అందించడంలో దిట్టగా నిలిచిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు హ్యాచ్ బ్యాక్ కార్లలో ఇది ఒకటి కావడం విశేషం.
ఎస్ యూ వీ పేరు టాటా టియాగో. ఈ కారులో ఉండే ఫీచర్లు ఏంటో చూద్దాం.. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, కారు వెనుక పార్కింగ్ సెన్సార్, వెనుక పార్కింగ్ కెమెరాతో పాటు ఈబీడీ, ఏబీఎస్ ఉన్నాయి. అలాగే ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం కూడా ఈ కార్లలో ఉంటుంది. దాంతో పాటు స్పీకర్ సౌండ్ సిస్టమ్ ను కలిగి ఉండటం విశేషం.
మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ వేరియంట్ లీటర్ కు 19.01 కిలోమీటర్ల మైలేజీ, సీఎన్జీ వేరియంట్ తో అయితే కిలోకు 26.49 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. అంతేకాదు టాటా టియాగోలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండగా ఇది 86 బీహెచ్పీ శక్తిని, 113 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుందని సంస్థ విక్రయదారులు చెబుతున్నారు.
ముఖ్యంగా సామాన్యులకు, మధ్య తరగతి ప్రజల బడ్జెట్ లో అందుబాటులో ఉంటుంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.5.60 లక్షల నుంచి రూ.8.20 లక్షల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫీచర్లతో పాటు సరసమైన ధరకు వస్తుండటంతో ఎక్కువగా మధ్య తరగతి ప్రజలు ఈ కారును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు.