N convention centre: హైదరాబాద్ నగరం ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ లాగా మారిపోయింది. కానీ ఒకప్పుడు చెరువులు, కుంటలు, ఉద్యానవనాలతో అలరారింది. కూలీ కుతుబ్ షా తన కలలకు అనుగుణంగా వీటన్నిటిని నిర్మించాడు. మీరు మోమిన్ వీటికి రూపకల్పన చేశాడు. అందువల్లే హైదరాబాద్ నగరాన్ని లేక్ సిటీ అని పిలుస్తారు. బాగ్ నగరం అని కూడా అభివర్ణిస్తారు.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత తమ్ముడి కుంట దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో తమ్మిడికుంట సంబంధించి ఆసక్తికర విషయాలను ఒకసారి పరిశీలిస్తే.. తమ్మిడి కుంట ఉన్న ప్రాంతం మాదాపూర్. ఇప్పుడంటే అది సైబర్ సిటీగా విశ్వవిఖ్యాతి పొందింది. కానీ ఒకప్పుడు ఈ ప్రాంతం చెరువులు, కుంటలు, ప్రత్యేక చరిత్ర ఉన్న రాళ్లగుట్టలతో అలరారింది. దుర్గం చెరువు దాదాపు 350 సంవత్సరాల కిందటి వరకు గోల్కొండ కోటకు తాగునీరు అందించింది. దుర్గం చెరువుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో తమ్మిడికుంట ఉంది.. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిందా? నాటి నిజాం పరిపాలకులు నిర్మించారా? అనేవి తెలియకపోయినప్పటికీ.. 40 సంవత్సరాల క్రితం వరకు ఖానా మెట్ ప్రజలకు తాగు, సాగునీటి అవసరాలు తీర్చింది.. ఈ చెరువు పరిరక్షణ కోసం కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారు.. 29 ఎకరాల 60 గుంటల విస్తీర్ణంలో తమ్మిడికుంట చెరువు ఉంది. గణపతి నిమజ్జనం, బతుకమ్మ వేడుకలకు ఈ చెరువు ఆలపాలంగా ఉండేది. తామర పువ్వులకు నెలవై ఉన్న నేపథ్యంలో ఆ చెరువుకు తమ్మిటికుంట అనే పేరు వచ్చిందని ప్రముఖ భాషావేత్త ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు.
ఇదీ చెరువు స్వరూపం
తమ్ముడి కుంట ఖానా మెట్ గ్రామ పరిధిలో ఉంది..36, 11/2 సర్వే నెంబర్ల పరిధిలో 29.6 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో నాగార్జునకు 11/2 సర్వే నెంబర్లు 8 ఎకరాల భూమి ఉంది. ఎఫ్ టీ ఎల్ లో 1.12 ఎకరాల భూమి ఉంది. బఫర్ జోన్ పరిధిలో 2.18 ఎకరాలు ఉంది. వీటిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ షెడ్లను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించక ముందు ఆ భూమిలో నాగార్జునకు గెస్ట్ హౌస్ ఉండేది. అప్పట్లో ఆ అతిథి గృహానికి వచ్చి నాగార్జున సేదతీరే వారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా వచ్చి రిలాక్స్ అయ్యేవారు. చెరువు ప్రాంతం కావడంతో.. వాతావరణం కూడా ఆహ్లాదంగా ఉండేది. మాదాపూర్ ప్రాంతం సైబర్ సిటీగా రూపాంతరం చెందకమందు ఈ చెరువు అక్కడి ప్రజలకు తాగునీటిని అందించేది. శివారు గ్రామాల పొలాలకు సాగునీరు కూడా సరఫరా అయ్యేది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించిన తర్వాత ఆ చెరువు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. 29 ఎకరాల చెరువు కాస్త చిన్న కుంట ను తలపిస్తోంది.