https://oktelugu.com/

N convention centre : కోట్లాది ఆస్తులు ఉన్నా.. నాగార్జునకు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎందుకు ప్రత్యేక మంటే?

 హైదరాబాద్ మహానగరంలో ఎన్నో ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. మరెన్నో రిసార్ట్స్ ఉన్నాయి. అన్నింటికీ మించి గొప్ప గొప్ప హోటల్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని మించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంది.

Written By:
  • NARESH
  • , Updated On : August 25, 2024 / 11:54 AM IST

    Nagarjuna N convention centre

    Follow us on

    N convention centre: అక్కినేని నాగార్జున తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి నల్లా ప్రీతం రెడ్డితో కలిసి 14 సంవత్సరాల క్రితం ఎన్ -3 ఎంటర్ప్రైజెస్ పేరుతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. “మీ ఎలాంటి సందర్భమైనా.. మా వేదికలో జరుపుకోవచ్చని” అప్పట్లో దీనికి ట్యాగ్ లైన్ ఏర్పాటు చేశారు. అందువల్లే హైదరాబాద్ నగరంలో ఎఎలాంటి వేడుకలకైనా ఎన్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా మారింది. ఈ కన్వెన్షన్ సెంటర్లో నాలుగు ప్రధాన హాల్స్ ఉన్నాయి. 27 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 3,000 మంది కూర్చునే విధంగా ప్రధాన హాల్ నిర్మించారు. ఇందులో శ్రీమంతుల కుటుంబాల వివాహాలు, రిసెప్షన్లు, ఫ్యాషన్ పరేడ్లకు ఈ కన్వెన్షన్ సెంటర్ వేదికయింది. ఈ కన్వెన్షన్ సెంటర్ లో ప్రారంభ ధర 5 లక్షలు గా ఉంది. వారి వారి స్తోమత ఆధారంగా వేడుకలను జరిపేవారు. అయితే అందుకు తగ్గట్టుగానే ఫీజు వసూలు చేసేవారు..

    ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో..

    ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డైమండ్ హాల్ నిర్మించారు. ఇందులో 500 మంది దాకా కూర్చునే అవకాశం ఉంది. చిన్న చిన్న వేడుకలు ఇందులో జరిపేవారు. ఓపెన్ ఎయిర్ వెన్యూ పేరుతో 26, చదరపు అడుగుల విస్తీర్ణంలో మరో హాల్ కూడా నిర్మించారు. ఇవే కాకుండా అనెక్స్ అనే పేరుతో ఏడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మరో హాల్ కూడా నిర్మించారు. హీరో నాగార్జునది కావడంతో చాలామంది ఈ కన్వెన్షన్ సెంటర్ లో వేడుకలు జరపడాన్ని తమ సామాజిక హోదాగా భావించేవారు. ఈ కన్వెన్షన్ సెంటర్ ఒకవేళ ఖాళీగా లేకపోతే వేడుకలను వాయిదా వేసుకున్న వారు కూడా ఉన్నారు. ఓ ప్రముఖ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ తమ షో లను మొత్తం ఇందులోనే జరిపేది.. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు తమ వార్షిక వేడుకలను ఇక్కడే నిర్వహించుకునేవి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఇక్కడి 4 వేదికల్లో వేరువేరు పేరుతో పార్టీలు జరిగేవి. ఇలాంటి పార్టీలు జరుగుతాయి కాబట్టి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు ప్రత్యేకమైన పేరు ఉంది.. ఈనెల 26న ఈ నాలుగు హాల్స్ లో పెళ్లిళ్లు జరగాల్సి ఉంది. కొంతమంది పార్టీలకు కూడా ఈ కన్వెన్షన్ సెంటర్ ను బుక్ చేసుకున్నారు. దీనిని నేలమట్టం చేయడంతో వారు ఇప్పుడు గందరగోళంలో పడ్డారు.

    ఖరీదైన వేడుకలకు కేరాఫ్ అడ్రస్

    నూతన సంవత్సర సందర్భంగా ఇక్కడ జరిపే వేడుకలు తారాస్థాయిలో ఉంటాయని సెలబ్రిటీ సర్కిల్లో ప్రచారం ఉంది. ఇక్కడ ఎలాంటి వేడుకలు జరిగినా పోలీసులు పట్టించుకోరనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే కొంతమంది సెలబ్రిటీలు తమ ప్రైవేట్ పార్టీలకు ఈ కన్వెన్షన్ సెంటర్ ను వేదికగా చేసుకునేవారు. ఫీజు ఎంత ఉన్నా కూడా చెల్లించేవారు. అందువల్లే ఎన్ కన్వెన్షన్ సెంటర్ సెలబ్రిటీ వర్గాలలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో ఒకానొక సందర్భంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పడగొట్టేందుకు జెసిబిలు వచ్చాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని.. ఆ జె సి బి లు వెనక్కి వెళ్లిపోయాయి. తర్వాత ఎన్ని సంవత్సరాలకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని హైడ్రా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పడగొట్టింది.