https://oktelugu.com/

Medaram: మేడారం భక్తులకు ఇదో గొప్ప గుడ్‌ న్యూస్‌.. ఈసారి ట్రై చేయండి!

రెండేళ్ల క్రితం కరోనా కారణంగా మేడారం జాతరకు తక్కువ మంది వచ్చారు. కానీ, ఈసారి భారీగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 16, 2024 2:04 pm
    Medaram

    Medaram

    Follow us on

    Medaram: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు ఉన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం(ఫిబ్రవరి 14న) గుడిమెలిగే వేడుకతో ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తల్లులను దర్శించుకునేందుకు లక్షలాదిగా తరలి వస్తున్నారు. దారులన్నీ మేడారం వైపే కదులుతున్నాయి. సొంత వాహనాలు, అద్దె వాహనాలు, ఆర్టీసీ బస్సులతోపాటు ఎడ్ల బండ్లపై కూడా మేడారం వస్తున్నారు. అందరి దారి మేడారంవైపే సాగుతోంది.

    భక్తులకు హెలికాప్టర్‌ సేవలు..
    ఇక మేడారం భక్తులకు ఈసారి హెలికాప్టర్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. మేడారం భక్తుల కోసం పర్యాటక శాఖ గతంలో హెలికాప్టర్‌ సేవలు అందించిన సంస్థలోనే ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇంకా «చార్జీల వివరాలు ప్రకటించలేదు. హనుమకొండ నుంచి సేవలు అందుబాటులో ఉంటాయి. ఇలా వెళ్లిన వారికి ప్రత్యేక దర్శనం కూడా ఉంటుంది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరిగి హనుమకొండకు తీసుకువస్తారు. ప్రత్యేకంగా హెలికాప్టర్‌ జాయ్‌రైడ్‌ కూడా ఉంటుంది. జాతర పరిసరాలను విహంగ వీక్షణం చేయవచ్చు.

    2 కోట్ల మంది వచ్చే అవకాశం..
    రెండేళ్ల క్రితం కరోనా కారణంగా మేడారం జాతరకు తక్కువ మంది వచ్చారు. కానీ, ఈసారి భారీగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లక్షల మంది తల్లులనున దర్శించుకున్నారు. జాతర ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం అవుతుంది. జాతర జరిగే ఐదు రోజుల్లో సుమారు 2 కోట్ల మంది భక్తులు మేడారం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారని తెలుస్తోంది. ఈమేరకు ఏర్పాట్లు చేశారు.

    పర్యవేక్షిస్తున మంత్రి సీతక్క..
    ఇక మేడారం జాతర ఏర్పాట్లను గిరిజన బిడ్డ, తెలంగాణ మహిళా, శిషు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పనులన్నీ దగ్గరుండి చేయించారు. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయి. జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక యాప్‌ కూడా రూపొందించారు. ఇంటర్‌నెట్‌ లేకుండా కూడా ఈ యాప్‌ పనిచేస్తుంది. ఇందులో జాతరలో ఉండే ఆస్పత్రులు, బస్టాండ్లు, వైద్యులు, టాయిలెట్లు, హెల్ప్‌లైన్‌ సెంటర్లు, పోలీస్‌ సేవలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. రూట్‌ మ్యాప్, పార్కింగ్‌ విరాలు కూడా యాప్‌లో అందుబాటులో ఉంచారు.